ETV Bharat / state

రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన వర్షాలు- కొనసాగుతున్న వరద ఉద్ధృతి - Rains Decrease in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2024, 4:27 PM IST

Rains Decrease in AP: మూడు రోజులుగా ఏపీని ముంచెత్తిన వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరద నీరుతో లోతట్టు ప్రాంతాలు ప్రమాదపు అంచుల్లోనే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ద్రోణి ప్రభావంతో మరో 24 గంటల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

Rains Decrease in AP
Rains Decrease in AP (ETV Bharat)

Rains Decrease in AP : శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్ద తీరాన్ని దాటిన వాయుగుండం ప్రస్తుతం దక్షిణ ఒడిశా - ఛత్తీస్​గఢ్ భూభూగాలపై కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (India Meteorological Department) (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఇది ఛత్తీస్​గఢ్​లోని జగదల్​పూర్​కు 60 కిలోమీటర్లు, మల్కాన్ గిరికి 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు ఐఎండీ (AP Weather Report Today) ప్రకటించింది. గడచిన 6 గంటలుగా ఇది వాయువ్య దిశగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదిలినట్టు తెలిపింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీన పడుతుందని ఐఎండీ స్పష్టం చేసింది.

ఏపీలో భారీ వర్షాలు - సహాయక చర్యలపై చంద్రబాబు సమీక్ష - CM Chandrababu Review On Rains

తగ్గుతున్న వర్షాల ఉధృతి : మరోవైపు వాయువ్య భారత్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తర కోస్తాంధ్ర పై పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ ఉన్న రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతున్నట్టు ఐఎండీ తెలిపింది. వీటన్నిటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. మరోవైపు వాయుగుండం ప్రభావం ఏపీపై క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. దీంతో క్రమంగా వర్షాల ఉధృతి కూడా తగ్గుతుందని స్పష్టం చేసింది.

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు : మరోవైపు ఎగువ ప్రాంతాలైన ఛత్తీస్​గఢ్​, తెలంగాణాలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఏర్లు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షపు నీరు పరీవాహాక ప్రాంతం నుంచి నదుల్లోకి భారీగా వచ్చి చేరుతోంది.

జలదిగ్బంధంలో విజయవాడ - గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడనంత వర్షం - ఆరుగురు మృతి - HEAVY RAINS IN VIJAYAWADA

విజయవాడలో వివిధ ప్రాంతాలు జలమయం : ప్రస్తుతం ఎగువ నుంచి కృష్ణా నదికి 7.25 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. మొత్తం 70 గేట్లనూ ఎత్తి యథాతధంగా ఆ నీటిని దిగువకు సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. దీంతో పాటు బుడమేరుకు వస్తున్న వరదనీరుతో విజయవాడ పశ్చిమ ప్రాంతమైన సింగ్ నగర్ సహా వివిధ పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు - ప్రజలకు మంత్రుల సూచన - Ministers Review on Heavy Rains

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.