Rain Alert in AP : ప్రతి సంవత్సరం అక్టోబరులో ఏపీకి తుపానుల ముప్పు తీవ్రంగా ఉంటుంది. గతంలో ఈ నెలలో వచ్చిన తుపానులు ప్రాణ, ఆస్తినష్టం తీవ్రంగా మిగిల్చాయి. అందుకే అక్టోబర్ ఈ నెల పేరు వింటేనే రాష్ట్ర ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా వారిలో ఆందోళన మొదలవుతుంది. చిన్నపాటి గాలి వీచినా రైతులు అల్లాడిపోతారు. పైలిన్, హుద్ హుద్, అంపన్ ఇలా పేరేదైనా, ఎక్కడ తీరం దాటినా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో విపత్తులు పొంచి ఉంటాయి. గతంలో ఈ నెలలో వచ్చిన తుపానులు ప్రాణ, ఆస్తినష్టం తీవ్రంగా మిగిల్చాయి.
Cyclone Warning to AP : ఏపీకి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. అది ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ నమూనాలు (మోడల్స్) అంచనా వేస్తున్నాయి.
ఏపీకి 3 తుఫాన్ల హెచ్చరిక! - పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
తీవ్ర వాయుగుండంగా బలపడి, ఈ నెల 17 నాటికి రాష్ట్రంలోని తీరం దాట వచ్చని భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) భావిస్తోంది. ఇది తుపానుగా బలపడి రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు రాష్ట్రం మధ్యలో ఈ నెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చని అమెరికా నమూనా అంచనా వేస్తోంది. అల్పపీడనం ఏర్పడ్డాక దీనిపై స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు అంటున్నారు.
ఆ జిల్లాలో భారీ వర్షాలు : ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.
మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండం : అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. కర్ణాటక, గోవా రాష్ట్రాల తీరాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ 2 లేదా 3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
బంగాళాఖాతంలో పొంచి ఉన్న తుపానులు! - నవంబరు వరకు రాష్ట్రానికి గడ్డుకాలం - Storms in the Bay of Bengal
ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం- అక్టోబర్, డిసెంబర్లో కూడా వర్షాలు పడతాయ్! : IMD