Raghuramakrishnan Raju Comments: విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతున్నారనీ అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారని జోస్యం చెప్పారు.
వైజాగ్లో ఉన్న పిచ్చి ఆసుపత్రిలో ప్రాంగణంలో, జగన్ ప్రమాణ స్వీకారం పెట్టుకోవచ్చని రఘురామ ఎద్దేవా చేశారు. జూన్ 4వ తేదీ తరువాత వైసీపీ నాయకులు కనబడరని పేర్కొన్నారు. దేవుడు అతి తీవ్రంగా కరుణిస్తే 50 సీట్లు లేదంటే 25 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వ్యాపారం, వైద్యం నిమిత్తం లండన్ వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానం కోసం గంటకు 12 లక్షలు ఖర్చు పెడుతున్నారని తెలిపారు. భూ హక్కు పత్రాలు పై జగన్ ఫొటోలు వేసుకున్నారని విమర్శించారు. తనకు తాను అతిగా ప్రేమించుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. తాను ఎంపీ గా పోటీ చేయాలని అనుకున్న, దేవుడు తనకు ఎమ్మెల్యే ఇచ్చాడని అన్నారు.
ఉండి నియోజకవర్గంలో 30 వేలు మెజారిటీతో గెలుస్తున్నట్టు చెప్పారు. జగన్ జనవరిలో బట్టన్ నొక్కితే ఇప్పటికి డబ్బులు పడలేదని విమర్శించారు. తనకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కాలు పెట్టడని. కౌంటింగ్ తరువాత కొన్ని చోట్ల అల్లరు జరిగే అవకాశం ఉందనీ అన్నారు. జూన్ 4వ తేదీ మద్యాహ్నం నుంచి వైసీపీ నాయకులకు అల్లర్లు చేయడానికి కూడా ఓపిక ఉండదని అన్నారు, ఏ బి వెంకటేశ్వరరావు పై కావాలనే కక్ష సాధింపు కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పడుతుందని, తాను ముందే చెప్పినట్లు పేర్కొన్నారు.
జగన్ సభలకు లక్షలాదిమందిని బలవంతంగా తీసుకువచ్చారని రఘురామ ఆరోపించారు. 125 లేకపోతే 150 స్థానాలు కూటమికి వస్తాయని పేర్కొన్నారు. అంబటి రాంబాబుపై కన్నా లక్ష్మీనారాయణ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని తెలిపారు. కూటమి వచ్చిన తరువాత చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చీఫ్ సెక్రటరీని సస్పెండ్ చేస్తే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తప్పక వస్తారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రుషికొండ నిర్మాణాలపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. జూన్ 4న ఫలితాల తరువాత వైసీపీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని రఘు రామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు.