Public Protest Against YSRCP Leaders in Flooded Areas: విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మాజీమంత్రి బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. ఇళ్లు మునిగిన ఐదు రోజుల తర్వాత ఎందుకు వచ్చారని బాధితులు బొత్సను నిలదీశారు. బాధితులకు సాయం అందకుండా అడ్డుపడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు ఏం సాయం చేశారని మహిళలు ప్రశ్నించారు. 'అధికారంలో లేనోళ్లం ఏటి సేత్తాం' అంటూ మహిళలకు సమాధానం చెప్పలేక బొత్స వెనుదిరిగారు.
మెుండితోక జగన్‌కు పరాభవం: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పునరావాస కేంద్రానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే మెుండితోక జగన్‌కు పరాభవం ఎదురైంది. వరద బాధితుల వద్దకు వెళ్లిన జగన్ మోహన్ రావును ప్రజలు నిలదీశారు. మూడురోజుల నుంచి పట్టించుకోకుండా ఇప్పుడెందుకొచ్చారంటూ ప్రశ్నించారు. మూడు రోజులుగా పునరావాస కేంద్రంలో కూటమి నేతలు బాధితులకు ఆహారపానీయాలు ఇస్తుంటే ఇప్పుడొచ్చి మాజీ ఎమ్మెల్యే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మెుండితోక జగన్మోహన్రావుకు వ్యతిరేకంగా వరద బాధితులు నినాదాలు చేశారు. గో బ్యాక్ మెుండితోక జగన్ అంటూ నినాదాలు చేసిన బాధితులను జగన్ మోహన్ రావు దూషించారు. ఈ క్రమంలో తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే తనకారు ఎక్కి తిరిగి వెళ్లిపోతుండగా కొందరు బాధితులు వాహనానికి అడ్డుపడ్డారు.
వరద బాధితులకు అండగా టాలీవుడ్ హీరోలు - తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం - Donations To Telugu States
పవర్‌స్టార్ గొప్ప మనసు - వరద బాధితులకు రూ.6 కోట్లు విరాళం - Pawan Dontation to Flood Victims