ETV Bharat / state

వైద్యవిద్యార్ధిని హత్యపై కొనసాగుతున్న నిరసనలు - తోటి వైద్య విద్యార్ధులకు రాఖీలు కట్టిన జుడాలు - Protests on Medical Student Murder

Protests Across AP Over Medical Student Murder in Kolkata: కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు, పలు కళాశాలల విద్యార్ధులు  ఆందోళనను ఉద్ధృతం చేశారు. యువతులపై వేధింపులు, అత్యాచారాలు నిరోధించే చట్టాలు చేయాలంటూ నిరసన చేపట్టారు. వీరికి మద్దతుగా పలు విద్యార్ధి సంఘాలు, వ్యవసాయ,కార్మిక సంఘాలు నిలుస్తున్నాయి.

doctors_protests_in_ap
doctors_protests_in_ap (doctors_protests_in_ap)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 19, 2024, 5:26 PM IST

Protests Over Medical Student Murder in Kolkata: రాఖీ పండుగ రోజు సంతోషంగా చేతికి రాఖీలు కట్టించుకోవాల్సిన జూనియర్ వైద్యులు చేతికి నల్ల రిబ్బన్లు ధరించారు. కోల్‌కతాలో క్రూరంగా హత్య చేయబడిన వైద్యురాలి ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు పోరాటం చేస్తున్నారు. ధర్నా,ఫ్లాష్ మాబ్, కొవ్వొత్తుల ర్యాలీ ఇలా పలు విధాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని తేవాలని డిమాండ్ చేస్తున్నారు.

గత కొద్ది రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు వైద్య సేవలను అందించటం లేదు. అత్యంత హేయంగా ఓ విద్యార్ధిని ఆసుపత్రిలోనే చంపటం భయాందోళనలు కలిగిస్తోందన్నారు. తమ సమస్య పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. వీరికి మద్దతుగా పలు విద్యార్ధి సంఘాలు, వ్యవసాయ,కార్మిక సంఘాలు నిలుస్తున్నాయి.

Visakha: విశాఖ జూనియర్‌ డాక్టర్ల సంఘం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపింది. మహిళలపై వేధింపులు, అత్యాచారాలు నిరోధించే చట్టాలు చేయాలంటూ.

Prakasam District: ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్‌ ఆస్పత్రి వద్ద జూనియర్ వైద్యులు నాలుగో రోజు దీక్షలో పాల్గొన్నారు. నిందితురాలికి న్యాయం జరిగేవరకు విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. నంద్యాలలో పీజీ వైద్య విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్ష నాలుగో రోజు కొనసాగింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ప్రేమించమని బాలికపై యువకుడు ఒత్తిడి - ఆపై ఏం చేశాడంటే? - Rape on girl in Ntr District

Vizianagaram: విజయనగరంలో ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ ర్యాలీ చేపట్టారు. కోట కూడలి నుంచి మూడు లాంతర్ల వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో భాగంగా బాలికలను చదవనిద్దాం- బాలికలను ఎదగనిద్దాం, మహిళలకు రక్షణ కల్పిద్దాం- అత్యాచారాలను ఆరికడదాం అనే నినాదాలతో కూడిన బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం మూడు లాంతర్ల వద్ద రక్షాబంధన్ నిర్వహించారు. ఈ సందర్భంగా హత్యకు గురైన జూనియర్ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Yanam: కోల్‌కతాలో వైద్యురాలి మృతికి నిరసనగా కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వైద్యులు ధర్నా చేశారు. పుదుచ్చేరి జిప్మర్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. యానాంలోని జిప్మర్‌ ఆస్పత్రి వద్ద వైద్యులు, నర్సులు నిరసనకు దిగారు. మరణించిన వైద్యురాలికి న్యాయం చేయాలని ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేసే వారిని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Guntur: కోల్‌కతాలో వైద్య విద్యార్ధిని హత్య, అత్యాచారంపై గుంటూరు జీ.జీ.హెచ్​లో జూనియర్ వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. మహిళా జూడాలు తమ తోటి వైద్య విద్యార్ధులకు రాఖీలు కట్టారు. కోల్‌కతా తరహా ఘటనలు మరెవరికి జరగకుండా తాము అండగా ఉంటామని జూనియర్ వైద్యులు ప్రతిన పూనారు. వైద్యుల రక్షణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధిష్టమైన కార్యచరణ రూపొందించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని జూడాలు స్పష్టం చేశారు.

అనకాపల్లి జిల్లాలో విషాదం - సమోసాలు తిని ముగ్గురు విద్యార్థులు మృతి - Food Poison in Anakapalli District

'అమ్మా నేనేం పాపం చేశాను-నన్నొదిలి పోయావ్' - తల్లి అంత్యక్రియల కోసం చిన్నారి భిక్షాటన - Daughter Begged For Mother Funeral

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.