Proposals to Central Govt to set up Vijayawada Metro : రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా గత టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ మెట్రో ప్రతిపాదనలు పట్టా లెక్కితే తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం దానికి ఉరేసింది. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ను ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్‌గా పేరు మార్చింది. విజయవాడలో ఎలాంటి మెట్రో ఏర్పాటు చేయలేదని కార్యాలయాన్ని విశాఖకు తరలించింది. మెట్రో ప్రాజెక్టు ఆధారిత భారత్ హెవీ వెహికల్ లిమిటెడ్(BHVL), ఇతర సంస్థలూ తమ కార్యాలయాలను తరలించేశాయి. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు తిరిగి టీడీపీ ప్రభుత్వం ఊపిరి పోయనుంది. రాజధాని పనులు ఊపందుకోవడం, ఈ ప్రాంత అభివృద్ధిపై నగరవాసులు ఆశలు పెంచుకోవడంతో మెట్రో ప్రాజెక్టు తొలిదశకు ప్రాణం పోస్తూ పురపాలక శాఖ మంత్రి నారాయణ కేంద్రానికి మరోసారి ప్రతిపాదనలు అందించారు.
తొలి దశలో రెండు కారిడార్లు! : తొలి దశలో 38.40 కిలోమీటర్లు మేర రెండు కారిడార్లు నిర్మిస్తారు. గత ప్రతిపాదనల్లో ఒక కారిడారు పీఎన్‌బీ (Pandit Nehru Bus Station) నుంచి గన్నవరం వరకు (ఏలూరు రోడ్డు వెంట), మరో కారిడార్ పీఎన్ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు నిర్మిస్తారు. అప్పట్లో భారీ కసరత్తు చేసి భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి టెండర్లు పిలిచారు. అంతలోనే ఎన్నికలు రావడం వైఎస్సార్సీపీ గద్దెనెక్కాక అన్నీ ఆపేసింది. భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించి డీపీఆర్‌లూ (DPR) బుట్టదాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి అయితే అసలు ప్రతిపాదనలే పంపలేదు.
మెట్రో ప్రయాణికుల కోసం సరికొత్త సర్వీస్- ఇకపై మీ జర్నీ మరింత ఈజీ..!
విజయవాడ మెట్రో స్థానంలో తేలికపాటి మెట్రో ప్రాజెక్టు చాలని జగన్ సర్కార్ ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్‌ను సిస్ట్రా-రైట్స్ సంస్థకు అప్పగించగా 2019 ఏప్రిల్‌లో డీపీఆర్ అందించారు. విజయవాడ, అమరావతిలో కలిపి 85 కిలోమీటర్లు లైట్‌మెట్రో నిర్మించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించారు. ఇందుకు రూ.17,500 కోట్లు పైగా అవసరమని అంచనా వేసింది. తొలిగా విజయవాడలో 38.5 కిలోమీటర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. తర్వాత పరిణామాల్లో మెట్రో (Metro) ఆవశ్యకత గుర్తించి నాటి సీఎం చంద్రబాబు అధ్యయనానికి నాటి మంత్రి నారాయణ నేతృత్వంలో ఒక కమిటీని విదేశాలకు పంపారు. వివిధ మెట్రో ప్రాజెక్టులు పరిశీలించిన కమిటీ తేలిక పాటి మెట్రో సముచితమని నిర్ణయించింది.
"సాంకేతిక సమస్య" పట్టాలపైనే నిలిచిన మెట్రో రైళ్లు - దాదాపు అరగంట తర్వాత కదిలిన చక్రాలు
మొదటి దశలో :
కారిడార్-1: గన్నవరం నుంచి పీఎన్‌బీఎస్ వరకు (Gannavaram to PNBS) 26 కిలోమీటర్లు నిర్మిస్తారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో 3 కిలోమీటర్లు భూగర్భంలో నిర్మిస్తారు. దీనిలో ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేస్తారు.
కారిడార్-2: పీఎన్‌బీఎస్ నుంచి పెనమలూరు వరకు (PNBS to Penamalur) బందరు రహదారిపై 12.5 కిలోమీటర్లు నిర్మిస్తారు. ఈ కారిడార్‌లో మొత్తం 21 స్టేషన్లు, ఒక భూగర్భ స్టేషన్ ఉంటుంది. ఒక్కో స్టేషన్ నిర్మాణానికి 25 కోట్లు రూపాయలు అవుతుందని అంచనా.
హైదరాబాద్ మెట్రో రెండో దశ - నిర్మాణానికి పరిపాలన అనుమతులు
రెండో దశలో :
అమరావతి కారిడార్: పీఎన్‌బీఎస్ నుంచి అమరావతికి (PNBS to Amaravati) 27.5 కిలోమీటర్లు మేర నిర్మిస్తారు. ఈ కారిడార్ కృష్ణా కాలువ జంక్షన్ మీదుగానే వెళ్తుంది. అమరావతి పరిధిలో 5 కిలోమీటర్లు ఆకాశంలో, 15 కిలోమీటర్లు భూగర్భంలో నిర్మిస్తారు.
అమరావతి కారిడార్‌లో మొత్తం 32 స్టేషన్లు ఉంటాయి. అన్ని స్టేషన్లు కలిపి 60 వరకు ఉంటాయి. ఈ ట్రాక్‌పై 2 కార్ కోచ్‌లు నడుపుతారు. గన్నవరం వద్ద కోచ్‌డిపో పెడతారు. 400-450 మంది ప్రయాణించే వీలుంది. జక్కంపూడి వరకు ఉన్న కారిడార్‌ను అక్కడ ఆర్థిక నగరం ఏర్పాటు నేపథ్యంలో 16 కిలోమీటర్లు మేర వలయ రూపంలో నిర్మిస్తారు. తాజా ప్రతిపాదనల్లో జక్కంపూడి కారిడార్ మినహాయించినట్లు సమాచారం. ఈ కారిడార్లును రెండు దశల్లో కూటమి ప్రభుత్వం నిర్మించనుంది. ఇందురు అయ్యే మొత్తం ఖర్చు కేంద్రం భరించాలి. గతంలో జర్మనీ సంస్థ కేఎప్‌డబ్ల్యూ (KfW) మొత్తం రుణంగా అందించేందుకు ముందుకు వచ్చింది.