PM Modi Inaugurate IIM Visakha: రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM), తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఐసర్ ప్రాంగణాలను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 2016 నుంచి
ఐఐఎంకు శాశ్వత క్యాంపస్: విశాఖ ఐఐఎంకు సంబంధించి తాత్కాలిక క్యాంపస్‌ను నిర్వహిస్తున్నారు. అయితే విశాఖ ఐఐఎంకు ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో స్థలం కేటాయించారు. ఇందులో మొదటి దశ శాశ్వత భవన నిర్మాణాలను పూర్తిచేశారు. తాజాగా నేడు, విశాఖలోని ఆనందపురం మండలం గంభీరంలో ఐఐఎం శాశ్వత క్యాంపస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 241 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి కేటాయించారు. విద్యుత్ సరఫరా నీటి సరఫరా సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. 2015లో గంభీరంలో ఐఐఎంను స్థాపించారు. 17 రాష్ట్రాల నుంచి 40 మంది ప్రొఫెసర్లు విధులు నిర్వహిస్తున్నారు. 22 రాష్ట్రాల నుంచి 650 మంది ఎంబీఏ విద్యార్థులు విద్యాబ్యాసం చేస్తున్నారు. పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఈ ప్రాంగణం 62,350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తరగతి గదులు, పరిపాలన విభాగం గదులు, క్రీడా మైదానాలను తీర్చిదిద్దారు.
UAEలో అతిపెద్ద హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం: రాష్ట్రంలోని మంగళగిరిలోని అఖిల భారత వైద్య విద్యా సంస్థతోపాటు దేశంలోని అయిదు ఎయిమ్స్‌లను (AIMS) ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ ఆంశాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఓ ప్రకటనలో వెలువరించింది. అందులో భాగంగా ఈనెల 25వ తేదీన మంగళగిరిలోని ఎయిమ్స్‌ను మోదీ ప్రారంభించనున్నారు. 183. 11 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్మించారు. 125 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ఏర్పాటు చేయగా దానికి 1,618.23 కోట్ల రూపాయలను వెచ్చించింది.
'ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్‌గా భారత్- దేశాభివృద్ధిలో యువత భాగం'
దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు: అదే రోజు గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని రాజ్‌కోట్, మంగళగిరి, భటిండా, రాయబరేలి, కల్యాణి ఎయిమ్స్‌లను జాతికి అంకితం చేయనున్నారు. కేవలం ఎయిమ్స్‌లు మాత్రమే కాకుండా దేశంలోని పలు నర్సింగ్, మెడికల్ కళాశాలలను కూడా మోదీ ప్రారంభించనున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన పలు మెడికల్ కాలేజీలు, క్రిటికల్ కేర్ బ్లాకులు, సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలకు శంకుస్థాపన చేయనున్నారు. వీటి వ్యయం మొత్తం 11,391.79 కోట్ల రూపాయలు కాగా, ఇందులో ఏపీలో నిర్మాణాలు చేపట్టి ఏర్పాటు చేసిన వాటి విలువ 1,858.06 కోట్ల రూపాయలు.
క్యాంటీన్లో మోదీ లంచ్- టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుతో ముచ్చట్లు!