Roads In AP: గత పాలకుల నిర్లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ రహదారులు అస్తవ్యస్థంగా తయారయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు గుంతలమయంగా మారి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే చాలు గోతులు ఎక్కడున్నాయో తెలియక వాహనదారులు బారిన పడుతున్నామని వాహనదారులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
పీపీపీ విధానంలో రహదారుల అభివృద్ధి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పట్టణ, గ్రామాల్లో అధ్వానంగా తయారైన రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 16 నగరపాలక సంస్థల్లో మొదటి విడతగా 642 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందిస్తున్నారు. విశాఖలో అత్యధికంగా 253 కిలోమీటర్లు మిగతా చోట్ల కనిష్ఠంగా 5, గరిష్ఠంగా 83 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వ ఆమోదం లభించగానే టెండర్లు పిలుస్తారు.
పట్టణ స్థానిక సంస్థల్లో కీలకమైన రహదారుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. కొన్నిచోట్ల పాలకవర్గం, అధికారులు చొరవ తీసుకుని మరమ్మతులు చేసినా బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు హడలిపోయారు. దీంతో పురపాలక, నగరపాలక సంస్థల్లో రోడ్లన్నీ గోతులమయమయ్యాయి. టెండర్లు దక్కించుకునే గుత్తేదారులు రోడ్ల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టి తద్వారా వాటిపై పదేళ్లలో వచ్చే ఆదాయం తీసుకునేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. రోడ్లకు ఇరువైపులా వాహనాల పార్కింగ్ స్థలాలపై వచ్చే ఆదాయం గుత్తేదారులకే చెందుతుంది. ఇతరత్రా రుసుములపై సైతం వారికే హక్కు ఉంటుంది. రోడ్ల అభివృద్ధితో పాటు పదేళ్ల వరకు వాటి నిర్వహణ బాధ్యత కూడా గుత్తేదారులకే ఉంటుంది.
హడావుడి చేశారు, అర్ధాంతరంగా ఆపేశారు - నిత్యం నరకం చూస్తున్నామంటున్న రైతులు
రాష్ట్రంలో నరకప్రాయంగా రోడ్లు.. నిరసనలు వెల్లువెత్తుతున్న పట్టించుకోని ప్రభుత్వం!