ETV Bharat / state

ఎన్నికల డీఎస్సీకి ఈసీ బ్రేక్​ - ఆగిపోతుందని తెలిసే జగన్​ నాటకమంటున్న ప్రతిపక్షాలు - AP DSC 2024 Postpone

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 6:53 AM IST

Break to DSC with Election Code : ఎన్నికల ముందు, నిరుద్యోగ యువతను మభ్య పెట్టేందుకు జగన్ సర్కార్ ప్రకటించిన డీఎస్సీకి ఎన్నికల కోడ్‌తో బ్రేక్ పడింది. కోడ్ ముగిసిన తర్వాతే టెట్ ఫలితాలు విడుదల చేయాలని, డీఎస్సీ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళి కారణంగా డీఎస్సీ ఆగిపోతుందని ముందే తెలిసే నిరుద్యోగుల్ని మోసం చేసేందుకు జగన్ డీఎస్సీ ప్రకటించారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

EC on DSC
EC on DSC

Postponement of DSC Due to Election Code in AP : 2019 ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు నిద్రపోయారు. 2024 ఎన్నికలకు ముందు నిద్ర లేచి, డీఎస్సీ అంటూ హడావుడి చేశారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి నెల ముందు 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించారు. అది కూడా సక్రమంగా చేయకుండా, ప్రకటనలో గందరగోళం సృష్టించారు. న్యాయచిక్కుల కారణంగా మొదట్లోనే వాయిదాల పర్వం కొనసాగింది. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చేసింది.

ఎన్నికల ముందు డీఎస్సీ ప్రకటించిన జగన్ సర్కార్ ఆ ప్రక్రియ ముందుకెళ్లకుండా అడ్డుకునేందుకు కావాలనే అర్హతల్లో అయోమయం సృష్టించింది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు బీఎడ్‌ వారికి అర్హత కల్పించింది. బీఎడ్‌ చేసిన వారికి ఎస్జీటీ పోస్టులకు అర్హత లేదని జనవరి 26న జీవో 4ను జారీ చేశారు. తర్వాత ఫిబ్రవరి 12న జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ వారికి అర్హత కల్పించారు. 17 రోజుల్లోనే రెండు విరుద్ధ నిర్ణయాలను ప్రకటించారు.

టీఆర్‌టీ నిర్వహణపై హడావిడి ఎందుకు? పరీక్ష షెడ్యూల్‌ మార్చాలని హైకోర్టు ఆదేశం

ఈ గందరగోళంపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ వారు అనర్హులంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. న్యాయస్థానం ఆదేశాలతో ప్రభుత్వం డీఎస్సీ దరఖాస్తు గడువును ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు పొడిగించింది. అభ్యర్థులకు సన్నద్ధత సమయం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలివ్వడంతో డీఎస్సీ పరీక్షను మార్పు చేసింది. మార్చి 15 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామంటూ ప్రకటించింది.

ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాల విడుదల, డీఎస్సీ నిర్వహణపై ఈసీ నిర్ణయం కోసం నివేదిక పంపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కోడ్ ముగిశాకే టెట్ ఫలితాలు వెల్లడించాలని, డీఎస్సీ నిర్వహించాలని సూచించింది. ఇలా ప్రభుత్వమే వివాదం సృష్టించి వాయిదాకు కారణమైంది.

డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల - 6100 పోస్టులు, 12 నుంచి దరఖాస్తులు

మరోవైపు రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తూనే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. 2014-18 మధ్య తెలుగుదేశం హయాంలో రెండు సార్లు డీఎస్సీ నిర్వహించారు. డీఎస్సీ-2014లో 10,313 పోస్టులు భర్తీ చేయగా డీఎస్సీ-2018లో 7,902 పోస్టులకు ప్రకటన ఇచ్చారు. ఉమ్మడి ఏపీ నుంచి విభజిత ఏపీ వరకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మొత్తం 8సార్లు డీఎస్సీ ప్రకటించారు.

అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే - నిరుద్యోగ భృతి ఇస్తాం : చంద్రబాబు - Chandrababu Kuppam Tour

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.