ETV Bharat / state

రామ్మోహన్​కు పౌర విమానయానం,పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, వర్మకు భారీ పరిశ్రమల శాఖల కేటాయింపు - AP Ministers Portfolios

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 10, 2024, 7:45 PM IST

Updated : Jun 10, 2024, 8:11 PM IST

AP Ministers Portfolios: కేంద్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో, కేంద్ర మంత్రులకు శాఖలను కేటాయిస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కింజరాపు రామ్మోహన్‌ నాయుడికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, పెమ్మసాని చంద్రశేఖర్​కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు (సహాయమంత్రి), భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ మంత్రి) శాఖలను కేటాయించారు.

AP Ministers Portfolios
AP Ministers Portfolios (ETV Bharat)

AP Ministers Portfolios: మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలిసారి ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యాలపై కేంద్రమంత్రులకు మోదీ దిశానిర్దేశం చేశారు. కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రులకు శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి కూటమి తరపున గెలిచిన ముగ్గురికి కేంద్ర మంత్ర వర్గంలో అవకాశం కల్పించగా నేడు వారికి శాఖలను కేటాయింపులు జరిగాయి.

ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు: నిన్న ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా, కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కేటాయించగా, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు (సహాయమంత్రి), భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ మంత్రి) శాఖలను కేటాయించారు.

కింజరాపు రామ్మోహన్‌నాయుడు: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు. బీటెక్‌, ఎంబీఏ పూర్తి చేసిన రామ్మోహన్‌ నాయుడు వయస్సు 36 సంసవత్సరాలు. ఆయనకు భార్య శ్రావ్య, కుమార్తె ఉన్నారు. తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబర్‌ 2న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తర్వాత రామ్మోహన్‌ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున తొలిసారి పోటీచేసి లక్షా 27 వేల ఓట్లకుపైగా మెజార్టీలో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం ఓటమిపాలయినా, ఆయన మాత్రం ఎంపీగా గెలిచి పట్టు నిలుపుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3 లక్షల 27వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

ప్రమాణ స్వీకారం చేసిన మోదీ, కేబినెట్ మంత్రులు - శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు ట్వీట్‌ - CBN congratulated Modi on his third term PM

పెమ్మసాని చంద్రశేఖర్‌: గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. తల్లిదండ్రులు సువర్చల, సాంబశివరావు. MBBS, MD పూర్తిచేసిన చంద్రశేఖర్‌ వయసు 47 ఏళ్లు. భార్య డాక్టర్‌ శ్రీరత్న. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇక 2014లో నరసరావుపేట పార్లమెంట్‌ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్‌ పేరు ఖారరైనా రాజకీయక పరిణామాల నడుమ రాయపాటి సాంబశివరావు బరిలోకి దిగారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి మెుదటి ప్రయత్నంలోనే కేంద్ర మంత్రి అయ్యారు.

భూపతిరాజు శ్రీనివాసవర్మ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరఫున భారీ మెజార్టీతో విజయం సాధించిన శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. సంఘ్‌ పరివార్‌తో సత్ససంబంధాలు కలిగిన భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఏబీవీపీలో చురుగ్గా పనిచేసి పార్టీలో గుర్తింపు పొందారు. 1992 నుంచి 95 మధ్యలో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గానూ సేవలందించారు. తాజాగా కూటమి తరఫున నర్సాపురం అభ్యర్థిగా పోటీచేసిన భూపతిరాజు శ్రీనివాసవర్మ..వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉమాబాలపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు- సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది: చంద్రబాబు - Chandrababu Naidu on NDA Victory

Last Updated : Jun 10, 2024, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.