ETV Bharat / state

'ఆ రోజు రాత్రి ఏం జరిగింది?, ఆ పడవలు ఎవరివి?'- కుట్ర కోణంపై పోలీసుల దర్యాప్తు - Prakasam Barrage Boat Incident - PRAKASAM BARRAGE BOAT INCIDENT

Collision of Boats in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు ఆ పడవలు ఎవరివి ఎందుకు వచ్చాయి? ఎవరైనా కావాలని వదిలేశారా లేక నదీ ప్రవాహానికి కొట్టుకొచ్చాయా ఇలా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే వాటికి వైఎస్సార్సీపీ రంగులు ఉండటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలన్న ఇంజినీరింగ్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.

Collision of Boats in Prakasam Barrage
Collision of Boats in Prakasam Barrage (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2024, 7:06 AM IST

Prakasam Barrage Gates Damage Case : ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టిన ఘటనపై అనుమానాలున్నాయంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రి నిమ‌్మల రామానాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని నిగ్గు తేల్చాలంటూ ఇరిగేషన్ అధికారులు వన్​టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు.

ఈనెల 1న తెల్లవారుజామున మొత్తం 5 పడవలు బ్యారేజీ గేట్ల వద్దకు వచ్చాయని ఫిర్యాదులో అధికారులు పేర్కొన్నారు. వాటిలో చిన్న పడవ బ్యారేజీ గేటు దాటి వెళ్లిపోయిందని మరో నాలుగు గేట్ల వద్ద ఉన్నాయన్నారు. వీటిలో మూడు భారీ మర పడవలు ఉన్నాయని చెప్పారు. వీటితోనే నదిలో ఇసుకను తోడుతుంటారని తెలిపారు. అందులోని మూడు పడవలు గేట్లను తగిలి గట్టిగా ఢీ కొట్టడంతో మూడు కౌంటర్ వెయిట్ దిమ్మెలు ధ్వంసమైనట్లు ఫిర్యాదులు వివరించారు.

అసలు ఆరోజు రాత్రి ఏం జరిగింది? ఆ సమయంలో బ్యారేజీపై విధుల్లో ఎవరున్నారు? అనే విషయాలను పోలీసులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మూడు పడవలు గొల్లపూడి, సూరాయపాలెం వ్యక్తులకు చెందినట్లు సమాచారం. పడవలపై వైఎస్సార్సీపీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మూడు పడవలు వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్ అనుచరులవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్న పోలీసులు : సాధారణంగా మూడు పడవలు విడివిడిగా గొలుసులతో కడతారు. అయితే ఆ మూడింటిని ఒకే గొలుసుతో కట్టేశారని ఆరోపణలు వస్తున్నాయి. పడవలను ఎవరైనా కావాలని వదిలేశారా?లేక నదీ ప్రవాహానికి కొట్టుకొచ్చాయా అనే విషయాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పడవ యజమానులను గుర్తించి వారి నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Prakasam Barrage Works Updates : మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులను అధికారులు పూర్తి చేశారు. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్‌ వెయిట్‌లను విజయవంతంగా అమర్చారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రెండు రోజుల్లోనే ఇంజినీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేశారు. నిపుణుడు కన్నయ్యనాయుడు మార్గదర్శనంలో విజయవంతంగా గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. కీలక ఘట్టం పూర్తి కావడంతో అడ్డుగా ఉన్న పడవల తొలగింపుపై అధికారులు ఫోకస్ పెట్టారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లకు పూర్తయిన మరమ్మతులు - ఇక పడవల తొలగింపుపై దృష్టి - works Completed in Prakasam Barrage

వరదలతో రూ. 6,880 కోట్లు నష్టం - ప్రాథమిక నివేదిక సిద్ధం - Report on AP Floods Loss

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.