SP on Threat to Ex Minister Sidda Raghava Rao: ప్రకాశం జిల్లా ఒంగోలులోని మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంట్లో దొంగతనం పాల్పడిన ముగ్గురు వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గత నెలలో 27వ తేదీన రాత్రి ఇరువురు అగంతకులు కత్తితో ఒంగోలులోని లాయర్ పేటలో ఉన్న మాజీమంత్రి శిద్ధా రాఘవరావు ఇంటిలోపలికి గోడ దూకి ప్రవేశించారని ఎస్పీ తెలిపారు. వాచ్‌మెన్‌పై దాడి చేశారు. అయితే పక్కనే టేబుల్ పక్కన నిద్రపోతున్న గన్‌మాన్ లేవడంతో వారు వాచ్‌మెన్‌ను వదిలేసి పోయారు.
దీనిపై శిద్ధా రాఘవరావు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటి నుంచి పోలీసు బృందాలు అగంతకుల కోసం వెతికారు. తాజాగా సోమవారం ఉదయం 10:00కు వచ్చి బెదిరింపు లెటర్‌ను శిద్ధా రాఘవరావు ఇంటి ముందువేసి పరారయ్యాడు.
లేఖలో 7 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ, డబ్బు ఇవ్వకుంటే కుటుంబంతో సహా అంతం చేస్తామని బెదిరించారన్నారు. దీంతో అప్రమత్తమైనా పోలీసులు అగంతుకుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నట్లు చెప్పారు. బెదిరింపులకు పాల్పడిన వాళ్లు ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలురుగా గుర్తుంచామన్నారు. తల్లిదండ్లులు సైతం పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని సూచించారు.
Sidda Raghava Rao House Theft Attempt Issue: కాగా మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్సార్సీపీ నేత శిద్దా రాఘవరావు ఇంట్లో గత నెల 27వ తేదీన గుర్తుతెలియని దుండగులు హల్చల్ చేశారు. రాత్రి 12 గంటల సమయంలో రాఘవరావు ఇంటికి కాపలాగా ఉన్న వాచ్‌మెన్‌పై దుండగులు దాడి చేశారు. వాచ్మెన్ కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. శిద్ధా రాఘవరావు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
సిద్ధ రాఘవరావు ఇంట్లో ఉన్న సమయంలో దుండగులు ముఖం కనిపించకుండా మాస్కులు పెట్టుకుని అతని ఇంట్లోకి ప్రవేశించినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. దుండగుల చేతిలో చాకులు ఉన్నట్టు సీసీటీవీ పుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ రికార్డులు ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దుండగులు ఎవరు, ఎందుకు సిద్ధ రాఘవరావు ఇంట్లోకి చొరబడ్డారు అని వివిధ కోణాల్లో పోలీసులు ఆరా తీశారు. తాజాగా సోమవారం మరోసారి ఇంటిముందు లేఖ వేయడంతో పోలీసులు గాలించి పట్టుకున్నారు.
డైరెక్టర్ ఇంట్లో సర్పంచ్ భర్త చోరీ- దొంగతనం చేసి పేదలకు పంచుతూ! - Director Joshiy House Theft