ETV Bharat / state

"అధిక వడ్డీ, తక్కువ ధరకే వస్తువులు"- రూ.2.5 కోట్ల ఘరానా మోసం - Cheater Arrested on police

Police Arrested Cheater in Satya sai District : సత్యసాయి జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. అధిక వడ్డీలు, తక్కువ ధరలకు సరకులు ఇప్పిస్తానంటూ స్థానికులు ఆశ చూపి ఏకంగా 2.5 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు.

CHEATER ARRESTED ON POLICE
CHEATER ARRESTED ON POLICE (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 2:09 PM IST

Police Arrested Cheater in Satya sai District : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను మోసగించిన కేటుగాడిని సత్యసాయి జిల్లా నల్ల చెరువు పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన చిన్న ఓబులేసు అలియాస్ మహేశ్వరరెడ్డిగా పేరు మార్చకుని ప్రజలను మోసగించేవాడు. ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి మండల వ్యాప్తంగా 19 మంది నుంచి 2.5 కోట్ల రూపాయలు కాజేశాడు.

ప్రజలను మోసగించిన కేటుగాడు : సత్యసాయి జిల్లాలో నల్లచెరువు మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటూ తక్కువ ధరలకే చక్కెర, సిగరెట్లు ఇస్తానంటూ చిన్నఓబులేసు స్థానికులను నమ్మించారు. వ్యాపారం పేరిట అప్పులు తీసుకుని వంచించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నారు. డబ్బు తీసుకుని వడ్డీ చెల్లించపోవడంతో దామవాండ్ల పల్లికి చెందిన నీలకంఠారెడ్డి నిలదీయగా మోసం బయటపడింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఎంతో శ్రమించి ఎట్టకేలకు చిన్న ఓబులేసును అరెస్ట్​ చేశారు.

వాలంటీర్​ ఘరానా మోసం- అప్పు చేసి రూ.60 లక్షలతో పరారు - Volunteer Cheating

నిందితుడిపై 24 చీటింగ్‌ కేసులు : చిన్న ఓబులేశుపై రాయలసీమ జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాలోనూ 24 కేసులు నమోదైనట్లు కదిరి డీఎస్పీ శ్రీలత వెల్లడించారు. నిందితుడు తక్కువ ధరలకు సరకులు ఇప్పిస్తానంటూ నల్లచెరువు మండలం దామావాండ్లపల్లికి చెందిన నీలకంఠారెడ్డి నుంచి రూ. 90 లక్షలు అప్పుగా తీసుకున్నారని తెలియజేశారు. ఆయనతో పాటు మరో 18 మంది నుంచి 2.5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని మోసగించినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి, నకిలీ బంగారు వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు.

'యూ ఆర్​ అండర్​ డిజిటల్​ అరెస్ట్​' - అంటే నమ్మకండి! - cyber crimes in AP

అధిక వడ్డీ ఆశచూపి కోట్లలో వసూలు చేసి ఉడాయింపు - లబోదిబోమంటున్న బాధితులు - Two Crore Fraud In Satya Sai

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.