ETV Bharat / state

తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు- 'మన్​ కీ బాత్​'లో ప్రత్యేక ప్రస్థావన - PM Narendra Modi Wishes - PM NARENDRA MODI WISHES

PM Modi Mann ki Baat : ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం కాగానే గుర్తుకొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మన్‌ కీ బాత్‌. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరిపి తన మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమం ఇది.

PM Modi Wishes to Telugu People
PM Modi Wishes to Telugu People (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2024, 2:31 PM IST

PM Narendra Modi Wishes Telugu Language Day in Mann Ki Baat Program : ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ 113వ మన్​ కీ బాత్​ కార్యక్రమంలో.. ఈ నెల 29న (ఆగస్టు 29న) తెలుగుభాష దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రపంచంలోని తెలుగు మాట్లాడే వారందరికీ తెలుగుభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాష ఒక అద్భుతమైన భాష అని కొనియాడారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా నిర్వహించే 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో ఆ భాగంగా ప్రధాని తెలుగు భాషా దినోత్సవం గురించి ప్రస్తావించారు.

Telugu Language Day Sand Sculpture : తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా.. సందేశాత్మకంగా సైకత శిల్పం..

యువత రాజకీయాల్లోకి వస్తేనే ప్రజాస్వామ్యానికి బలం: వికసిత్‌ భారత్‌ లక్ష్యం దిశగా దేశ పునాదులను పటిష్ఠం చేసే ఎన్నో విషయాలు 21వ శతాబ్దంలో జరుగుతున్నాయని మోదీ మన్​ కీ బాత్​ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఎలాంటి నేపథ్యం లేని లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలని ఎర్రకోట వేదికగా ఇచ్చిన పిలుపునకు విస్తృత స్పందన వచ్చిందని వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశం, బలమైన ప్రజాస్వామ్యం కోసం నేటి యువత ప్రజా జీవితంలోకి రావాలని పునరుద్ఘాటించారు.

స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. దేశం కోసం వారు తమని తాము పూర్తిగా అంకితం చేసుకున్నారని తెలియజేశారు. నేడు వికసిత్‌ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి మనం మరోసారి అదే స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పెద్ద సంఖ్యలో యువత రాజకీయాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వారికి సరైన అవకాశం, మార్గదర్శకత్వం కావాలని తెలియజేశారు. కుటుంబ రాజకీయాలు నూతన ప్రతిభను అణచివేస్తాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ప్రభుత్వాలు ఉచితాలు ఆపి ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందిస్తే చాలు : వెంకయ్యనాయుడు

తొలిసారి అంతరిక్ష దినోత్సవం : అంతరిక్ష రంగంలో కృషి చేస్తున్న పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మోదీ ముచ్చటించారు. అంతరిక్ష రంగంలో భారత్‌ దూసుకెళ్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రయాన్‌-3 విజయానికి గుర్తుగా స్పేస్‌ డే (Space Day) నిర్వహించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదే (AUG 23) తొలి అంతరిక్ష దినోత్సవాన్ని(First Space Day) జరుపుకొన్నామని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో యువత పెద్ద ఎత్తున లబ్ధి పొందినట్లు వెల్లడించారు.చంద్రయాన్​ 3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై (moon south pole) దిగిన తొలి దేశంగా భారత్‌ నిలిచిందని గుర్తుచేశారు.

విస్తృతంగా హర్​ ఘర్​ తిరంగా ప్రచారం : ఈ సంవత్సరం ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టామని మోదీ తెలిపారు. ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల వద్ద జాతీయ జెండాలు ఆవిష్కరించినట్లు తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సామాజిక వేడుకగా మారిందని పేర్కొన్నారు. తన పిలుపు మేరకు దాదాపు ఐదు కోట్లకు పైగా మంది జాతీయ జెండాతో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసినట్లు వెల్లడించారు.

CM Jagan Neglect on Development of Urdu Language: నవంబరులో ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులు, మెరిట్‌ విద్యార్థుల ఎంపిక.. 11 నెలలు దాటినా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.