People Suffering Due to Lack of Bridge Over Nagavali River: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బలసల రేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడంతో స్థానికులకు రాకపోకలు కష్టంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో బలసల రేవు వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. వర్షాకాలంలో నది ఉద్ధృతి పెరగడంతో రాకపోకలు నిలిచిపోయి స్థానికులు అవస్థలు పడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గాలను కలుపుతూ ఇసుకలపేట- వాల్తేరు గ్రామాల మధ్య బలసల రేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం కోసం 2018లో టీడీపీ ప్రభుత్వం 60 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. పనులు ప్రారంభించే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. 2019లో 80 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణ పనులు వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. 50శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. గుత్తేదారుకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
Big Breaking : కోర్బా ఎక్స్ప్రెస్లో మంటలు- మూడు బోగీలు దగ్ధం - Fire Accident in Korba Express
దీంతో ఏళ్లుగా ఎంతో ఆశతో ఎదురు చూసిన రెండు నియోజకవర్గాల ప్రజలుకు నిరాశే ఎదురయ్యింది. అటువైపు నుంచి ఇటువైపు రావాలంటే పూర్వం నాటు పడవలను ఉపయోగించేవారు. ప్రస్తుతం పడవ ప్రమాదాలు కారణంగా ఎవరిని అనుమతించడం లేదు. దీంతో అటువైపు వెళ్లాలంటే దాదాపు 50 కిలోమీటర్లు మేర ఆటోల్లో ప్రయాణించి వెళ్లాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. నది అవతల వైపు ఇవతల వైపు గ్రామస్థులకు ఎక్కువగా కుటుంబ సంబంధాలు ఉన్నాయి. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగినప్పుడు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు.
నది అవతల వైపు ఇవతల వైపు గ్రామస్తులకు ఎక్కువగా కుటుంబ సంబంధాలు ఉండడంతో పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు ఏం జరిగినా రాకపోకలకు అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో స్థానికల్లో వంతెన నిర్మాణం పై మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రభుత్వం వంతెన నిర్మాణంపై దృష్టి పెట్టి పూర్తి చేసి రెండు నియోజకవర్గాల ప్రజల కలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కోతకు గురైన గోదావరి ఏటిగట్లు- స్థానికులను వెంటాడుతున్న వరద భయం - No Quality on Godavari Yetigatlu