ETV Bharat / state

అల్లూరిలో పొంగిపొర్లుతున్న వాగులు - సహాయక చర్యలు చేపట్టిన అధికారులు - People Suffering floods

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 12:39 PM IST

People Suffering Due to Godavari Floods in Alluri District : అల్లూరి జిల్లాలో కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఈ క్రమంలోనే వరద పోటుతో నీటిలోనే ఓ ఆటో నిలిచిపోయింది. వాగును దాటేందులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి వారికి కావలసిన సహాయ సహకారాలు అందజేస్తున్నారు.

floods_alluri_district
floods_alluri_district (ETV Bharat)
అల్లూరిలో పొంగిపొర్లుతున్న వాగులు - సహాయక చర్యలు చేపట్టిన అధికారులు (ETV Bharat)

People Suffering Due to Godavari Floods in Alluri District : అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యం ప్రాంతంలో 15 రోజులుగా వర్షాలు తగ్గలేదు. వానల జోరుతో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. సీతపల్లి వాగు, మడేరు వాగు, బొడ్లంక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలం పాముగండి వెళ్లేదారిలో వరద పోటుతో ఓ ఆటో నిలిచిపోయింది. అందులోని ప్రయాణికులు వాగు దాటేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

చింతూరు, కూనవరం మండలాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. కూనవరం మండలంలోని భద్రాయగూడెం, తాళ్లగూడెంలలో పడవపై ప్రయాణించి వరద బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నిత్యావసరాలు, టార్చ్ లైట్లు తదితర సరుకులు వరద బాధితులకు అందజేశారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు, రాకపోకలకు పడవలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. వరద బాధితులకు సహాయం చేయడానికి కంట్రోల్​ రూమ్​ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు

తగ్గని గోదావరి వరద ఉద్ధృతి - జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు - Godavari floods in ap

వరద బాధితులకు సాయం చేయడంలో పోలీసులు ముందడుగు వేశారు. వీఆర్​ పురం వరద నీటిలో చిక్కుకున్న గర్భిణీని అర్ధరాత్రి వేళ పడవలో తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. గర్భిణీ అనారోగ్యంతో ఉన్నట్లు పోలీసులకు సమాచరం రావడంతో వెంటనే స్పందించారు. ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలతో కలిసి గర్భిణీని కూనవరం మండలం కోతులగుట్ట కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందినందుకు పోలీసులకు మహిళా కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

గోదావరి మహోగ్రరూపం - విలవిల్లాడుతున్న లంక గ్రామాలు - Godavari Floods in AP

పోలవరం ప్రాజెక్ట్​ కాఫర్​ డ్యాం బ్యాక్​ వాటర్​ వల్ల జిల్లాలోని కూనవరం, ఎటపాక మండలాలు ముంపునకు గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంటలు లేక ఉండటానికి ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు ఆర్​ అండ్​ ఆర్​ ప్యాకేజీ ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుకుంటున్నారు.

జల దిగ్బంధంలోనే పలు గ్రామాలు - అవస్థలు పడుతున్న ప్రజలు - Godavari floods in ap

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.