ETV Bharat / state

ఉత్తరాంధ్రలో వర్షాలు తగ్గినా వీడని ముంపు - వేలాది ఎకరాల్లో పంట మునక - Floods in Coastal AP - FLOODS IN COASTAL AP

People Suffering Due to Floods in Coastal AP: గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గినా ముంపు వీడలేదు. కోనసీమ జిల్లాలోని వేలాది ఎకరాల్లో పంట నీట మునిగాయి. వరద ఉద్ధృతికి పలు గ్రామాల్లో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఉద్యాన పంటలను వరద ముంచెత్తడంతో భారీగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

People Suffering Due to Floods
People Suffering Due to Floods (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 5:49 PM IST

Updated : Jul 23, 2024, 7:32 PM IST

ఉత్తరాంధ్రలో వర్షాలు తగ్గినా వీడని ముంపు - వేలాది ఎకరాల్లో పంట మునక (ETV Bharat)

People Suffering Due to Floods in Coastal AP: ఉత్తరాంధ్రలో వర్షాలు తగ్గినా వరద ముంపు మాత్రం వీడలేదు. గోదావరి ప్రవాహాంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో వరద ప్రవాహానికి రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యాన పంటలను వరద ముంచెత్తడంతో భారీగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోనసీమ జిల్లా గంగవరం మండలం కోటిపల్లి రేవులో వరద ఉద్ధృతి కొనసాగుతుంది. సుందరపల్లి గ్రామం వద్ద ఏటుగట్టు బలహీనంగా ఉందని అధికారులు గుర్తించారు. గ్రామాల్లోకి వరద ప్రవేశించకుండా ఏటుగట్టు వద్ద సుమారు 2 వేల ఇసుక బస్తాలతో అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా కోటిపల్లి, ముక్తేశ్వరం వైపు వెళ్లే వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సహాయక చర్యలను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పర్యవేక్షించారు. బలహీన ఏటుగట్ల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై కలెక్టర్​ అధికారులతో సమీక్షించారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో దంచికొట్టిన వానలు - వేల ఎకరాల్లో పంట నష్టం - Heavy rains in west Godavari

మామిడికుదురు మండలం తప్పనపల్లి వద్ద కాజ్‌వే నీట మునిగింది. అప్పనపల్లి, బి.దొడ్డవరం, పదపట్నం లంకగ్రామల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు దగ్గరుండి ప్రజలను ప్రత్యామ్నాయ మార్గాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం కాజ్​వైపై వరద నీరు చేరింది. గ్రామస్థులు నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఉద్యాన పంటలు నీట మునిగాయి. పి.గన్నవరం నియోజకవర్గంలోని లంక గ్రామాల్లో వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ముమ్మిడివరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. అన్నంపల్లిలోని స్టాక్‌ పాయింట్‌ను కలెక్టర్​ పరిశీలించారు. ఏటిగట్ల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయినవిల్లి లంక, అద్దంకివారి లంక, వీరవెల్లిపాలెం, పల్లపు లంక ప్రజలు మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ ప్రయాణాలు సాగిస్తున్నారు. లంక గ్రామాల్లో పడవలు ఏర్పాటు చేసి వైద్య శిబిరాలు కొనసాగించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. లంకలో ఉన్న పశువులకు వైద్యులు టీకాలు వేశారు.

గోదావరి వరద ముంపులో వందలాది గ్రామాలు, వేలాది ఎకరాలు - People Suffer in FLOOD WATER

అల్లూరి జిల్లాలోని కూనవరం, వీఆర్​పురం మండలాలు ముంపునకు గురయ్యాయి. స్థానిక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కూనవరంలో శబరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. దేవీపట్నంలో గండిపోచమ్మ ఆలయం, కూనవరంలో పోలీస్ స్టేషన్ నీట మునిగింది. పాడేరు ఏజెన్సీలో వరి నాట్లు నీటమునిగి వేలాది ఎకరాల్లో నష్టం జరిగింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గల డుడుమా జలాశయం ప్రమాద స్థాయికి చేరింది. 2,590 అడుగుల సామర్థ్యం ఉన్న జలాశయం గరిష్ఠ స్థాయికి మించి 2,591 అడుగుల వద్ద ప్రమాదస్థాయిలో ఉంది. నాలుగువేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

విశాఖలోని మధురవాడలో రక్షణ గోడ కూలి ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి రక్షణ గోడ అమాంతం కూలిపోయింది. దీంతో దిగువున పనిచేస్తున్న కార్మికులపై ఒక్కసారిగా మట్టి దిబ్బలు పడటంతో ఇద్దరు కార్మికులు వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం గాయత్రి ఆసుపత్రికి తరలించారు.

వీడని వర్షాలతో పొంగిపొర్లుతున్న నదులు, వాగులు - Flood Effect in Andhra Pradesh

Last Updated : Jul 23, 2024, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.