ETV Bharat / state

గోదావరి వరద ముంపులో వందలాది గ్రామాలు, వేలాది ఎకరాలు - People Suffer in FLOOD WATER - PEOPLE SUFFER IN FLOOD WATER

People Suffer Godavari Catchment Areas in Flood Water: ఎగువ నుంచి వస్తున్న వరద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద పోటేత్తడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు బిగ్గుబిగ్గుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముంపు గ్రామాల్లో జిల్లా కలెక్టర్‌లు సైతం పర్యటించారు. వరద ప్రవాహాం ఎక్కువగా ఉండటంతో పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు కలెక్టర్లు విజ్ఞప్తి చేశారు.

Godavari Catchment Areas in Flood Water
Godavari Catchment Areas in Flood Water (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 8:27 PM IST

Updated : Jul 22, 2024, 9:00 PM IST

People Suffer Godavari Catchment Areas in Flood Water: ఎగువ నుంచి వస్తోన్న వరదతో గోదావరి పోటెత్తింది. ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు బిగ్గుబిగ్గుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అనేక గ్రామాలు ముంపులో మగ్గుతున్నాయి. వరి నారు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. లంక గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది.

ప్రాజెక్ట్ స్పిల్ వే వద్ద 32 మీటర్లకు పైగా నీటిమట్టం నమోదైంది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాముల మధ్య వరద నీరు వచ్చి చేరింది. పోలవరం ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుతున్న కొద్దీ ముంపు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని ముంపు గ్రామాల్లో కలెక్టర్‌ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రశాంత్‌ కిషోర్‌ పర్యటించారు. చాకరపల్లి గ్రామానికి వెళ్లిన కలెక్టరేట్‌ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వీడని వర్షాలతో పొంగిపొర్లుతున్న నదులు, వాగులు - Flood Effect in Andhra Pradesh

కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు మరపడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో వశిష్ట, వైనతేయ, వృద్ధ గౌతమి నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అయినవిల్లి లంక గ్రామాలు నీటి మునిగాయి. ముమ్మిడివరం మండలం‌ కొత్తలంక, అయినాపురం గ్రామాలలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పర్యటించారు. నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంకగ్రామాల్లో కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ పర్యటించారు. కోతకు గురైతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ఎర్ర కాలువ ఉగ్రరూపం దాల్చింది. వందల ఎకరాల పంట పొలాలను ముంచేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిడదవోలు, అత్తిలి, తణుకు మండలాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండడంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. వీధుల్లో నీరు నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు. నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గంటగంటకు నీటిమట్టం పెరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల మధ్య పడవలపై రాకపోకలు అధికారులు నిలిపేశారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గోదావరి వరద ఉద్ధృతిని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాలకోడేరు మండలం మాగల్లులో గోస్తాని మురుగు డ్రైన్‌కు గండిపడి 200 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. గండిని పూడ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో దంచికొట్టిన వానలు - వేల ఎకరాల్లో పంట నష్టం - Heavy rains in west Godavari

తూర్పుగోదవరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి భారీగా పెరిగింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వరద ముంపుతో జిల్లా వ్యాప్తంగా సుమారు 70 వేల ఎకరాల పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. సీతానగరం మండలం మిర్తిపాడు- బొబ్బిల్లంక వద్ద వంతెన కొట్టుకుపోయిన ప్రాంతంలో 15 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయం నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మూడు గేట్లు ఎత్తి 585 క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలంలో భూపతిపాలెం, ముసురుమిల్లి జలాశయాలు నిండుకుండల్లా మారాయి. మూడు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. భారీ వరదలతో అల్లూరి జిల్లాలోని గిరిపుత్రులు సాహసం చేస్తున్నారు. తమ గ్రామలకు వెళ్లేందుకు ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న వాగుకు అటు-ఇటు చెట్టుకు తాడు కట్టి ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నారు.

కొనసాగుతున్న వరద - వణికిపోతున్న గోదావరి పరివాహక ప్రాంతాలు - Rains Effect in Joint East Godavari

Last Updated : Jul 22, 2024, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.