People Suffer Due to Damaged Bridge in Jangareddygudem : జంగారెడ్డిగూడెం పట్టణంలోకి వచ్చేందుకు వీలుగా ఉన్న ఆ వారధి కూలి ఆరేళ్లవుతోంది. వంతెన కూలి రాకపోకలు మందగించగా రహదారి అని కూడా చూడకుండా గడిచిన ఐదేళ్లలో ఆ ప్రాంతాన్ని డంపింగ్ యార్డుగా మార్చేశారు. వంతెన లేకపోవడంతో పట్టణం నుంచి జాతీయ రహదారిపైకి నేరుగా వస్తూ పలువురు వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. కొత్త వారధి కోసం పుర ప్రజలతో పాటు ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు.
భారీ వరదలతో కూలిన వంతెన : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం తూర్పున ఉన్న బయనేరు వాగుపై ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన హావ్ లాక్ వంతెన 2018లో వచ్చిన భారీ వరదల్లో కూలింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ముఖ ద్వారంగా చెప్పుకునే ఈ వంతెన దశాబ్దాల పాటు సేవలు అందించింది. ఈ వంతెన అందుబాటులో ఉన్నంత కాలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి జంగారెడ్డిగూడెం మీదుగా తెలంగాణలోని అశ్వారావుపేటకు రాకపోకలు సాగేవి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో పోరాటం - మూణ్నాళ్ల ముచ్చటగా చప్టా నిర్మాణం - bridge damage in nellore
రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, భీమవరం, పోలవరం, కొవ్వూరు, కొయ్యలగూడెం ప్రాంతాల నుంచి వచ్చేవారు తల్లాడ-దేవరపల్లి జాతీయ రహదారిపై సీతంపేట వద్ద ఉన్న కరాటం జంక్షన్ నుంచి బయనేరు వంతెన మీదుగా జంగారెడ్డిగూడెంలోకి వచ్చేవారు. హైదరాబాద్ వైపు రాకపోకలు సాగించే సరకు రవాణా వాహనాలు మినహా కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు అన్నీ ఈ వంతెనపై నుంచే ప్రయాణించేవి. వంతెన కూలి ఈ మార్గం మూతపడటంతో వాహనాదారులు అవస్థలు పడుతున్నారు.
దస్త్రాలకే పరిమితమైన బుడమేరు వంతెన- ఇంకా మోక్షం ఎప్పుడో? - Bridge Construction works delay
మూతపడి వాహనాదారుల అవస్థలు : వంతెన కూలి వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఈ ప్రాంతాన్ని గడిచిన ఐదేళ్లలో డంపింగ్ యార్డుగా మార్చేశారు. జంగారెడ్డిగూడెంలో నిత్యం సేకరించిన చెత్తా చెదారాన్ని తీసుకొచ్చి వంతెన సమీపంలో పడేస్తున్నారు. ఫలితంగా బయనేరు వాగు పక్కనే వందల ఏళ్ల నాటి నుంచి ఉన్న శివాలయానికి వచ్చే భక్తులు దుర్గంధం భరించలేక ఇబ్బందులు పడుతున్నారు.
వంతెన నిర్మాణానికి టీడీపీ హయాంలో 2018లోనే సెంట్రల్ రోడ్ ఫండ్ కింద రూ. 3.50 కోట్ల మంజూరు చేశారు. తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు పట్టాలెక్కలేదు. గడిచిన ఐదేళ్లలో 8 సార్లు టెండర్లు పిలిచినా ఒక్కటి కూడా దాఖలు కాలేదు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు వంతెన నిర్మించేందుకు ఆసక్తి చూపించలేదు.
హంద్రీ వంతెనపై భారీ గొయ్యి - వాహనదారులు ఆందోళన - Handri bridge