Unsanitary Conditions at AC Subba Reddy Market in Nellore : పేరుకే అది పెద్దమార్కెట్. లోపల అడుగుపెడితే అంతా దుర్వాసనే! దుకాణాల ముందు వెనుక చెత్తాచెదారమే. అపరిశుభ్ర వాతావరణంలోనే కూరగాయల కొనుగోళ్లు! ఇదీ నెల్లూరులోని ఏసీ మార్కెట్ దుస్థితి. చిన్న వర్షానికే చిత్తడిగా మారే ఈ మార్కెట్‌లో కొనుగోలు దారులు, వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
కొనుగోలుదారుల ఇబ్బందులు : నెల్లూరులో ప్రధానమైన ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ ఉంది. సుమారు ఎకరా ప్రాంగణంలో విస్తరించిన ఈ మార్కెట్‌లో వందకుపైగా హోల్ సేల్ దుకాణాలు ఉంటాయి. రోజుకు 5లక్షలు రూపాయలమేర కూరగాయలు, ఆకుకూరల వ్యాపారం సాగుతోంది. అదేవిధంగా సమీపంలోనే మరో చిన్న మార్కెట్ ఉంది. ఇంత ప్రధానమైన మార్కెట్ నిర్వహణను అధికారులు నిర్లక్ష్యంగా వదిలివేశారు. ఫలితంగా చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
"మార్కెట్లో నడవడానికి కూడా వీలులేకుండ చాలా అపరిశుభ్రంగా ఉంది. అలాగే దుర్వాసన వెదజల్లుతోంది. శుభ్రత లేకపోవడంతో ఎక్కడ చూసిన ఆవులు, కుక్కలు, పందులు మార్కెట్లో తిరుగుతున్నాయి. ఇక వర్షం పడితే మార్కెట్ మొత్తం బురద మయం అవుతోంది. కాలుపెట్టడానికి కూడా చోటు ఉండదు. మార్కెట్లోకి వచ్చేటప్పుడే ఘాటు వాసన వస్తొంది. ఫలితంగా ఊపిరి ఆడని పరిస్థితి. ప్రశాంతంగా కూరగాయలను కొనుగోలు చేయలేక పోతున్నాం. ఇక్కడికి వస్తే రోగాల బారిన పడతామనే భయం ఉంది. ఈ సమస్యపై గతంలో అధికారులకు ఫిర్యాదులు చేసిన ఇప్పటికి పట్టించుకొలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం వ్యాపారుల కోసం దుకాణాలను ఏర్పాటు చేసింది. వాటిని వ్యాపారులకు అప్పజెప్పకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు." - స్థానికులు
నిరుపయోగంగా దుకాణాలు : చిన్నమార్కెట్‌లో కూరగాయల వ్యాపారం కోసం గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో షాపుల దుకాణ సముదాయాన్ని నిర్మించారు. అందులో వందకు పైగా షాపులున్నాయి. అధికారులు వాటిని అద్దెకివ్వకుండా రోడ్లపై వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారు. కోట్ల ఖర్చుతో నిర్మించిన దుకాణాలు నిరుపయోగంగా మారాయి. పురపాలక శాఖ మంత్రి నారాయణ చొరవ తీసుకుని నగరం నడిబొడ్డున ఉన్న ఏసీ సుబ్బారెడ్డి మార్కెట్‌ను స్వచ్ఛమార్కెట్‌గా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.
రంగు రంగుల దివ్వెలు, రకరకాలు ప్రమిదలు - దీపాల పండుగ వేళ మార్కెట్లో కళ
'ఫిష్ ఆంధ్ర' అన్నారు- మోడ్రన్ ఫిష్ మార్కెట్ భవనాన్ని మూలన పడేశారు - YCP Govt Neglectd Fish Markets