ETV Bharat / state

కనిగిరిలో దాహం కేకలు- గుక్కెడు నీళ్లు కోసం ప్రజలు నానా అవస్థలు - నీటి సమస్యతో ప్రజల కష్టాలు

People Are Facing Water Problems at Kanigiri: గుక్కెడు నీళ్లు దొరక్క కనిగిరి ప్రాంత ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాల్సిన మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించక నీటి సరఫరాను నిలిపివేశారు. గత 15 రోజులుగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు మున్సిపాలిటీ వద్ద ఆందోళన చేశారు. ప్రజలకు మద్దతుగా తెలుగుదేశం, సీపీఐ పార్టీలు మద్దతుగా నిలిచాయి.

People Are Facing Water Problems at Kanigiri

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 5:28 PM IST

కనిగిరిలో దాహం కేకలు- గుక్కెడు నీళ్లు కోసం ప్రజలు నానా అవస్థలు

People Are Facing Water Problems at Kanigiri: వేసవి పూర్తిగా ప్రారంభం కాకముందే గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు నానా అవస్థలు పడుతున్న దృశ్యాలు ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటు చేసుకున్నాయి. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలు, కొత్తపేట, సుభాష్ రోడ్డు, లాడే సాహెబ్ బజార్లలో ప్రజలు నీటి కోసం పడరాని కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. నీటిని అందించాల్సిన మున్సిపల్ అధికారులు బిల్లులు చెల్లించక నీటి సరఫరా నిలిపివేశారు. గత 15 రోజులుగా ట్యాంకర్లను నిలిపివేయడంతో గుక్కెడు నీటి కోసం వందలు వెచ్చించి కొనుగోలు చేసి జాగ్రత్తగా వాటిని వాడుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

కనిగిరి మహిళలు నిరసన-నీరు అడిగితే పార్టీ రంగులు పులుముతున్నారు

People Have Struggle For Water: నీటి కోసం కొందరు వ్యవసాయ పొలాల్లో ఉన్న బోర్ల వద్ద నుంచి ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుంటున్నారు. ఒక్కొక్క ట్యాంకర్​కు సుమారు రూ.500 నుంచి 800 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. మరికొందరు ఒక క్యాను వాటర్​ను పది రూపాయలకు కొనుగోలు చేసి వాటిని త్రాగేందుకే మాత్రమే జాగ్రత్తగా వాడుకుంటున్న దుర్భర పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యపై ప్రశ్నిస్తే ఏ ముప్పు వచ్చి పడుతుందోనని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

గతంలో కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో గుత్తేదారుల ద్వారా రోజుకు 200 ట్రిప్పుల నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం అది 100 టిప్పులకు కుదించి నీటిని అందిస్తున్నారు. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో ట్యాంకర్లతో వచ్చే నీటిని నిలిపివేశారు. దీంతో గత 15 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు నీటి సరఫరా కోసం నూతన టెండర్ కొరకు గుత్తేదారులను పిలవగా ముందుకు వచ్చే నాధుడే కరవయ్యారు. అందుకు ఫలితంగా గత 15 రోజులుగా కనిగిరి ప్రాంత ప్రజలు నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా నీళ్లు రావడం లేదని ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలు, అధికారులు ఇబ్బందులకు గురి చేస్తారని భయంతో స్థానిక ప్రజలు నీటి కొరత ఉన్నా సర్దుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

శ్రీ సత్య సాయి జిల్లాలో ఉగ్రరూపం దాల్చుతున్న తాగునీటి సమస్య- జాతీయ రహదారిపై బైఠాయించిన మహిళలు

TDP Leaders Supported People Agitation For Water: గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వడం లేదని కనిగిరి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ప్రజలు ముట్టడించారు. స్థానికులు మున్సిపాలిటీ వద్ద ఆందోళన చేయగా తెలుగుదేశం నేతలు వారికి మద్దతు పలికారు. మున్సిపల్ కార్యాలయం వద్ద సకాలంలో నీళ్లు అందించాలంటూ టీడీపీ నేత ఉగ్ర నరసింహారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి నినాదాలు చేశారు. గత 15 రోజులుగా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగేందుకు కూడా గుక్కెడు నీళ్లు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకు సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. యధావిధిగా నీటిని అందించాలని మున్సిపల్ కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు.

కుళాయిల రిపేర్​కు రూ.1500 ఇవ్వాల్సిందే - వైసీపీ ఎంపీటీసీ దౌర్జన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.