ETV Bharat / state

సీఎం సభకు బస్సులు తరలింపు- నానా అవస్థలు పడుతున్న విద్యార్థులు, మహిళలు - అనకాపల్లిలో సీఎం జగన్‌ సభ

People Are Facing Problems in CM Jagan Meeting: ఆయన వస్తున్నాడంటేనే ప్రజలు హడలిపోతున్నారు. అనకాపల్లిలో జరగనున్న సభకు సీఎం జగన్​ వస్తుండటంతో ప్రజలు గంటలు తరబడి ట్రాఫిక్​లో​ వేచి చూడాల్సి వచ్చింది. సభకు జనాన్ని తరలించేందుకు 45 ఆర్టీసి బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు, మహిళలు బస్సులు లేక నానా అవస్థలు పడ్డారు.

People Are Facing Problems in CM Jagan Meeting

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 1:46 PM IST

సీఎం సభకు బస్సులు తరలింపు- నానా అవస్థలు పడ్డ విద్యార్థులు, మహిళలు

People Are Facing Problems in CM Jagan Meeting: సీఎం జగన్ ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. అనకాపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి సభ జరగనున్న నేపథ్యంలో జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. జనాన్ని తరలించేందుకు అనకాపల్లి జిల్లా నుంచి 45 ఆర్టీసీ బస్సులతోపాటు వివిధ జిల్లాల నుంచి మరో 250 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. బస్టాండ్​లో బస్సులు లేక ప్రయాణికులు నానా పాట్లు పడుతున్నారు.

నేడు విశాఖలో పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశం

Traffic Problems With CM Jagan Meeting: బస్సుల కోసం విద్యార్థులు, చిన్న పిల్లలతో మహిళలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. పిసినికాడలో ఏర్పాటు చేసిన సీఎం బహిరంగ సభకు సంబంధించి కాన్వాయ్ ట్రైల్ రన్ చేయడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్​లో ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్లే విద్యార్థులు ఇరుక్కున్నారు. సమస్యను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ట్రాఫిక్​ను క్లియర్​ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి పర్యటనను పురస్కరించుకొని కశింకోట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో హెలిప్యాడ్ను అధికారులు సిద్ధం చేశారు. ఈ క్రమంలో భారీ వృక్షాలను సైతం నరికేసి మోడుగా మార్చేశారు. బాల సదనంలో ఉన్న భారీ వృక్షంతో పాటు మండల పరిషత్, తహసీల్దార్, వ్యవసాయ కార్యాలయాలకు వచ్చే ప్రజలంతా సేదతీరే చెట్టు కొమ్మలను సైతం నరికేశారు.

సిద్ధం సభకు 2 వేల 500 బస్సులు! - ఇంటర్ విద్యార్థుల పరిస్థితి ఏంటి - ప్రజలు ఎలా పోయినా పర్లేదా?

CM Jagan Visit in Anakapalle: వైఎస్సార్​ చేయూత పథకం నాలుగో విడత డబ్బులను విడుదల చేసేందుకు సీఎం జగన్​ అనకాపల్లి వస్తున్నారు. సీఎం జగన్ వస్తున్నారంటే చాలు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆయన వచ్చే మార్గంలో వాహనాల రాకపోకలను గంటల తరబడి అధికారులు నిలిపివేస్తుంటారు. జాతీయ రహదారిని ఆనుకొని సభ ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలను పోలీసులు దారి మళ్లింపు చేశారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రయాణికులు గుంతలు పడిన రోడ్లపై వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు లంకెలపాలెం కూడలి నుంచి పరవాడ, అచ్యుతాపురం, ఎలమంచిలి మీదుగా జాతీయ రహదారిని చేరుకోవాలని పోలీసులు సూచించారు. తుని నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు సైతం రేగుపాలెం జంక్షన్ నుంచి ఎలమంచిలి, అచ్యుతాపురం మీదుగా విశాఖకు చేరుకోవాల్సి వస్తుంది. దీని వల్ల వాహనాలు 10 కి.మీ ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుందని, ఆ రోడ్డంతా గోతులతో నిండి ఉంటుందని ప్రయాణికులు వాపోతున్నారు.

జగన్​ విశాఖ పర్యటన - ఐటీ ఉద్యోగులు, సామాన్యులకు తప్పని తిప్పలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.