Pawan From Vizag Got Mister India Title in ICN Body Building Championship Competition : ఆరిలోవకు చెందిన కె. పవన్ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. నాలుగేళ్ల క్రితం కరోనా సమయంలో లాక్ డౌన్ బయటకు రావడానికి లేని సమయంలో ఇంటిలో యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండేవాడు. ఆ సమయంలో కొందరు జిమ్, బాడీ బిల్డింగ్ సర్కిల్ పరిచయం అయ్యారు. వారు ఇచ్చిన సహకారంతో మెల్లమెల్లగా జిమ్ చేయడం, బాడీ బిల్డింగ్ సాధన చేసాడు. నాలుగేళ్లు సాధన చేస్తున్న సమయంలో గోవాలో ఐసీఎన్ మిస్టర్ ఇండియా, బాడీ బిల్డింగ్ పోటీలు జరుగుతాయని తెలుసుకుని వెళ్లి పాల్గొన్నాడు. సుమారు రెండు వందల మందికి పైగా పోటీదారుల మధ్య తన ప్రతిభను చూపించి ఐసీఎన్ మిస్టర్ ఇండియా, బాడీ బిల్డింగ్ పోటీలో వ్యక్తిగత పతకాలతో పాటు మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు. ఇప్పుడు ఇంటర్ నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీలకు సిద్ధం అవుతున్నాడు. సరదాగా మొదలు పెట్టిన బాడీ బిల్డింగ్ తనకు ఒక గొప్ప లక్ష్యాన్ని అందించిందని చెప్తున్నాడు పవన్.
'విశాఖ లంకపల్లి బుల్లయ్య కాలేజీ లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ మిగిలిన సమయంలో జిమ్ చేస్తూ బాడీ బిల్డింగ్ చేస్తూ తన కల నెరవేర్చుకోవడానికి శ్రమిస్తూ పవన్‌కు కుటుంబ సహకారం ఎప్పుడూ ఉంటుంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన బిడ్డకు ప్రోత్సాహం ఇస్తున్న వారందరికి చాలా థాంక్స్.' -బుజమ్మ ,పవన్ తల్లి
సహాయంలో చెయ్యందిస్తారు - ఆపదొస్తే ఆప్తబాంధవులు
'ఆరిలోవ వాసులు పవన్ గెలుపుతో గర్వపడుతున్నారు. తమ మధ్య ఉన్న యువకుడు గోవాలో విశాఖ పేరు నిలబెట్టారని రానున్న రోజులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నారు. క్రీడా సంస్థలు , క్రీడా పోత్సాహకారులు పవన్‌కు చేయూత అందిస్తే అంతర్జాతీయ స్థాయి లో జరిగే పోటీలో కూడా మన దేశ పేరు , విశాఖ పేరు నిలబెడతారని ఆశిస్తున్నాము.' -ఆరిలోవ వాసులు
తల్లిదండ్రులే స్ఫూర్తి- కళా రంగాల్లో రాణిస్తున్న యువతి - Meda Sindhu Shri From Vijayawada
సరదాగా మొదలుపెట్టిన అభిరుచి ఇప్పుడు ఒక ప్రోషెషనల్ విన్నర్‌గా పవన్‌ను మార్చింది. ఇప్పుడు అదే అభిరుచితో అంతర్జాతీయ స్థాయిలో గెలవడమే కాకూండా డిఫెన్స్ సెక్టార్లో ఉన్నతాధికారిగా ఎదగాలని కోరుకుంటున్నాడు. ఏ గురువు లేకుండా కేవలం యూట్యూబ్ వీడియోలతో మిత్రులతో వీడియో కాల్స్‌తో తీసుకున్న శిక్షణ తనని ఒక ఉక్కు మనిషిలా మార్చిందని ఆనందభాష్పాలు వెదజల్లుతున్నాడు.
ఎన్నో ఆర్థిక సమస్యలు అధిగమించి పీహెచ్డీ - కర్ణాటక గవర్నర్ నుంచి పట్టా అందుకున్న యువకుడు