Patients Facing Problems With Lack Of Facilities in Nellore GGH : నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో ఎక్కడ చూసిన సమస్యలే దర్శనమిస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా స్వచ్ఛతకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు, వారి సహాయకులకు కనీస సౌకర్యాలు ఉండటం లేదు. ఆసుపత్రి బయట మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్వహణ లోపంతో చెత్త పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని రోగుల సహాయకులు వాపోతున్నారు. నెల్లూరు జీజీహెచ్ కి వస్తే కొత్తరోగాలు వస్తాయని బాధితులు చెబుతున్నారు.
Audio viral: నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపులు..సూపరింటెండెంట్ బదిలీ
సమస్యలకు నిలయంగా మారిన నెల్లూరు జీజీహెచ్ : నెల్లూరు నగరం నడిబొడ్డులోని జీజీహెచ్ వైద్యశాల సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రతి రోజు వందలాది మంది రోగులు వైద్యం కోసం నెల్లూరు, కడప, ప్రకాశం, తిరుపతి జిల్లాల నుంచి వస్తుంటారు. ఆస్పత్రిలో అధునాతన పరికరాలతో ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. సుమారు వందమంది సిబ్బందికి పైగా ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇవన్నీ చెప్పుకునేందుకు బాగానే ఉన్నప్పటికీ ఆసుపత్రితోపాటు పరిసర ప్రాంతాలు అశుభ్రతతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. రోగుల సహాయకులు కోసం నిర్మించిన ప్రత్యేక షెడ్డు మరుగుదొడ్లు అశుభ్రంగా తయారయ్యాయి. వసతుల లేమితో ఆరుబయట అవస్థలు పడుతున్నామని రోగుల సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిర్వహణ లోపంతో ఆసుపత్రిలో పేరుకుపోయిన చెత్త : రోగులకు అవసరమైన మందులు, కొన్ని వైద్య పరీక్షలు నెల్లూరు జీజీహెచ్‌లో అందుబాటులో లేవని రోగుల సహాయకులు చెబుతున్నారు. సరైన వసతి సదుపాయాలు లేకపోవటంతో ఆసుపత్రి ఆవరణలోని చెట్లకిందే ఉంటున్నారు. నిర్వహణ లోపంతో చెత్త పేరుకుపోయి తీవ్ర దుర్వాసనతో అవస్థలు పడుతున్నామన్నారు. నెల్లూరు జీజీహెచ్‌కి వస్తే కొత్తరోగాలు వస్తాయని బాధితులు చెబుతున్నారు.
వసతులు లేక చెట్ల కింద ఉంటున్న రోగుల సహాయకులు : ఆసుపత్రికి వచ్చిన రోగులకు, వారి సహాయకులకు కనీస సౌకర్యాలు లేవు. ఆసుపత్రి బయట మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే రోగులు సహాయకుల కోసం ఆసుపత్రి బయట కూర్చోవడానికి గతంలో షెడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి శుభ్రంగా లేవు. అక్కడ కూర్చోవాలంటే దుర్వాసన వస్తోందని బాధితులు చెబుతున్నారు. దీంతో వైద్యం కోసం వచ్చే పేద కుటుంబాలు వేరే దారిలేక అపరిశుభ్రమైన వాతావరణంలోనే నిద్రిస్తున్నారు.
"ఆసుపత్రికి రోగాలు నయం కావటం కోసం వస్తే ఇక్కడ కొత్త రోగాలు వస్తున్నాయి. ఆసుపత్రి ఆవరణంలో ఎక్కడా శుభ్రత లేకపోవడంతో దోమలు విపరీతంగా ఉన్నాయి. అలాగే షెడ్లలో ఫ్యాన్లు ఉన్న తిరగటం లేదు. అవి ఎక్కడ ఊడిపడతాయని బిక్కుబిక్కుమంటూ నిద్రపోతున్నాము. ఇక్కడ అనేక విభాగాలు ఉన్న ఆసుపత్రి రీజీనల్ అధికారి, సూపరింటెండ్ సరిగ్గా పట్టించుకోవటం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా స్వచ్ఛతకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఈ పనులకు నియమించిన కాంట్రాక్ట్ సిబ్బంది చేత పనులు చేయించడంలో సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్షం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించి పరిశుభ్రత పాటించి, కనీస వసతులు కల్పించాలి." - రోగుల సహాయకులు
నెల్లూరు జీజీహెచ్ ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం...దర్యాప్తునకు ఆదేశం!
NON PAYMENT SALARY: అసలే చాలీచాలని వేతనాలు.. అవీ కొన్ని నెలలుగా పెండింగ్