ETV Bharat / state

నక్కపల్లి ప్రభుత్వాస్పత్రిలో వికటించిన ఇంజక్షన్లు - 18 మందికి అస్వస్థత - Patients ill after Injection - PATIENTS ILL AFTER INJECTION

Patients Became ill Due to Botched Injection : నక్కపల్లి ప్రభుత్వాస్పత్రిలో ఇంజక్షన్లు వికటించి 18 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధితులను అనకాపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఐదుగురు చిన్నారులు ఉండగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనపై హోం మంత్రి అనిత జిల్లా కలెక్టర్​ను అడిగి వివరాలు తెలుసుకున్నారు

injection_anakapalli
injection_anakapalli (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 9:43 AM IST

Patients ill after Injection in Nakkapalli Govt Hospital : అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాస్పత్రిలో ఇంజక్షన్లు వికటించి రోగులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఇంజక్షన్లు వేశారు. అయితే ఏమైందో తెలియదు ఉన్నట్లుండి ఇంజక్షన్లు తీసుకున్న వారికి ఊపిరి అందక తీవ్ర ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని గమనించిన వైద్యులు వైద్యం అందించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న హోంమంత్రి అనిత కలెక్టర్‌తో మాట్లాడి హుటాహుటిన అంబులెన్సులు పంపించారు. మెరుగైన చికిత్స కోసం బాధితులందర్నీ అనకాపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. 18 మంది రోగులు అస్వస్థతకు గురికాగా వీరిలో ఐదుగురు చిన్నారులున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంజక్షన్‌ వికటించి రోగులు అస్వస్థత - ఘటనపై మంత్రి ఆరా (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.