Opposition Leaders on Visakha Drug Case: ఉక్కు నగరం చుట్టూ మాదక ద్రవ్యాల ఉచ్చు బిగిసింది. విశాఖ తీరానికి బ్రెజిల్ నుంచి 25 వేల కిలోల డ్రగ్స్ దిగుమతి కావడంతో తీవ్ర దుమారం రేపుతోంది. ఇంటర్‌పోల్ సమాచారంతో పట్టుకున్న సీబీఐ సంధ్య ఆక్వా పరిశ్రమలో విస్తృతంగా సోదాలు జరిపింది. సిటీ ఆఫ్ డెస్టినేషన్‌గా ఉన్న విశాఖను సిటీ ఆఫ్ డ్రగ్స్‌గా వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.
Jana Sena Corporator Pithala Murthy Yadav Comments: విశాఖను మత్తు రాజధానిగా మార్చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్య ఆక్వా కంపెనీకు తాడేపల్లి ప్యాలెస్‌కు లింక్ ఉందని ఆరోపించారు. ఇప్పటి వరకు గంజాయి మాత్రమే విశాఖలో దొరికేది కానీ ఇప్పుడు ఇతర దేశాల నుంచి నేరుగా భారీ స్థాయిలో డ్రగ్స్ వస్తున్నాయని అన్నారు. విశాఖను గంజాయి రాజధానిగానే కాదు అంతర్జాతీయ డ్రగ్స్ రాజధానిగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డ్రగ్స్ కంటైనర్‌ను దిగుమతి చేసుకున్న వారు, చేయించిన వారు వైఎస్సార్సీపీ నేతలేనని ఆరోపించారు. వైసీపీ నేతలను డ్రగ్స్ తనిఖీలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారని మండి పడ్డారు. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడికి రవాణా అవుతోంది ఎవరికి దగ్గరకు వెళ్లడానికి అవకాశం ఉంది అనే కోణంలో దర్యాప్తు చేయాలని మూర్తి యాదవ్ అన్నారు.
TNSF State President MV Pranav Gopal Comments: రాష్ట్రంలో భారీ స్థాయిలో డ్రగ్స్ సరఫరా అవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ ప్రశ్నించారు. ఒకప్పుడు సింగపూర్ లాంటి నగరాలు డ్రగ్స్ సిటీగా ఉంటే ఇప్పుడు విశాఖ నగరంలో కూడా అదే పరిస్థితి వచ్చిందని అన్నారు. వైసీపీ నేతలు కచ్చితంగా దీన్ని వెనక ఉన్నారని అన్నారు. మొన్న ఎంపీ ఎంవీవీ కుటుంబంపై మీద దాడి జరిగిందని తాజాగా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ సతీమణిని కత్తితో భయపెట్టి పట్టపగలే దొంగతనం చేశారని అన్నారు. అంటే విశాఖలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో తెలుస్తోందని అన్నారు.
విద్యుత్ బకాయిలు చెల్లించండి - విశాఖ ఉక్కు పరిశ్రమకు నోటీసులు - Visakha steel industry
ప్రభుత్వంపై విశాఖ వాసులు ఆగ్రహం: ప్రశాంతమైన విశాఖను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చేశారని విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతను మత్తుకు బానిస చేసి ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పని చేయించుకోవడానికి 25 వేల కిలోల డ్రగ్స్ తీసుకొచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాదకద్రవ్యాల రాకెట్‌పై ఎన్నికల సంఘం విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరుతున్నారు.