One Student Died in Ajith Singh Nagar Madarsa : విజయవాడ అజిత్ సింగ్‌నగర్‌లోని మదర్సాలో విద్యార్థిని మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని మృతదేహంపై గాయాలున్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన బాట పట్టారు. ఇదిలావుంటే ఫుడ్ పాయిజన్ వల్లే విద్యార్థిని చనిపోయినట్లు మదర్సా నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్బంలో తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మదర్సాలో ఆకస్మిక తనిఖీలు చేశారు.
ఎమ్మెల్యే తనిఖీలో వంటగదిలో ఉన్న రెండు ఫ్రిడ్జ్‌లలో కుళ్లిన మాంసం ఉందని గుర్తించారు. ఎమ్మెల్యే బోండా ఉమ ఆదేశాలతో ఆహార భద్రత శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆహార భద్రత అధికారులు మాంసాన్ని సీజ్ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా మదర్సా నడుపుతున్నట్లు రెవెన్యూ అధికారుల తనిఖీలో బయటపడింది. వాస్తవాలు పోలీసు దర్యాప్తులో తెలుస్తాయని బోండా ఉమ తెలిపారు.
ఇంతకీ ఎం జరిగిందంటే : విజయవాడ అజిత్ సింగ్‌నగర్ ఎంకే (MK) బేగ్ స్కూల్ సమీపంలోని మదర్సాలో ఫుడ్ పాయిజన్ కావడంతో 8మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వారిలో గుడివాడకు చెందిన కరిష్మా అనే విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని మిగిలిన ఏడుగురి పరిస్థితి నిలకడగా ఉందని మదర్సా నిర్వాహకులు తెలుపుతున్నారు. న్యాయం చేయాలంటూ విద్యార్థిని తల్లిదండ్రులు ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఘటనపై స‌్పందించిన వీఎంసీ, హెల్త్ అధికారులు మదర్సాలోని తాగునీరు, వంటశాల ప్రాంతాలను పరిశీలించి ఘటనకు గల కారణాలను ఆరా తీశారు.
యోగి వేమన యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ - 50 మంది విద్యార్థినులకు అస్వస్థత
Parents Agitation : ఈ క్రమంలో మదర్సాలో గుడివాడకు చెందిన కరిష్మా అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఫుడ్ పాయిజన్ వల్లే మరణించినట్లు మదర్సా నిర్వాహకులు చెబుతున్నారని కరిష్మా కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కరిష్మా మృతి పట్ల అనుమానం ఉందని, ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహానికి విజయవాడ సర్వజన ఆసుపత్రిలో శవ పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎస్టీ కమిషన్ సభ్యుడు