AP Chief Electoral Officer Mukesh Kumar Meena: ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సుమారు 70 శాతం పూర్తయిందని సీఈవో చెప్పారు. అవసరమైతే 9వ తేదీ వరకు అవకాశం కల్పిస్తామన్నారు. సొంత నియోజకవర్గాల పరిధిలో ఉద్యోగులు వినియోగించుకోవాలని సూచించారు.
3.30 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు: కొన్ని పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు కోరిందన్నారు. వాటిపై ఆయా శాఖలను వివరణ అడిగినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదని, కొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని, ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. మొత్తంగా 4.30 లక్షల పోస్టల్ బ్యాలెట్ కోసం 3.30 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగించిన్నట్లు మీనా వెల్లడించారు. కొన్ని చోట్ల 12- డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందని, ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చునని వివరించారు.
జనసేనకు గ్లాసు సింబల్ కేటాయిస్తూ ఈసీ ఆదేశాలు - Janasena Glass Symbol
ఇప్పటికే సుమారు 20 రోజుల సమయం: సెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల తొమ్మిదో తేదీన కూడా అవకాశం ఉన్నట్లు మీనా స్పష్టంచేశారు. సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చునని సూచించారు. వచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టమని తెలిపారు. ఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చామన్నారు. కొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్న ఎన్నికల ప్రధానాధికారి, కొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చామని, కొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారని దీనిపై విచారణ చేపడుతున్నామని వివరించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పల్నాడు ఘటనపై విచారణ: పోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశామన్నారు. లీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది, రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నామన్నారు. పల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని, పల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నమన్నారు.
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌లో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం- ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు - POSTAL BALLOT voting problem in AP