ETV Bharat / state

ప్రభుత్వ సహకారం, సిబ్బంది కృషి - విజయవంతంగా మూడు భారీ పడవలు వెలికితీత - Three Boats successfully Removed

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Officials Successfully Removed Three Boats stuck at Prakasam Barrage : విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చి గేట్లకు అడ్డుగా ఉన్న మూడు భారీ పడవలను అధికారులు విజయవంతంగా తొలగించారు. ప్రభుత్వ సహకారం, సిబ్బంది కృషితోనే పడవలను వెలికితీశామని ప్రభుత్వ పత్యేక అధికారి కె.వి. కృష్ణారావు తెలిపారు. సరికొత్త ప్రణాళికతో భారీ బోట్లను బెకెం ఇన్ ఫ్రా సంస్థ ఇంజినీర్లు, అధికారులు బయటకు తీశారని వివరించారు. భారీ పడవలు ప్రకాశం బ్యారేజీకి ఢీకొట్టినా ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.

Officials Successfully Removed Three Boats stuck at Prakasam Barrage
Officials Successfully Removed Three Boats stuck at Prakasam Barrage (ETV Bharat)

Officials Successfully Removed Three Boats stuck at Prakasam Barrage : విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చి గేట్లకు అడ్డుగా ఉన్న మూడు భారీ పడవలను అధికారులు విజయవంతంగా బయటకు తీశారు. ప్రభుత్వ సహకారం, సిబ్బంది కృషితోనే పడవలను వెలికితీశామని ప్రభుత్వ పత్యేక అధికారి కె.వి. కృష్ణారావు తెలిపారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం నుంచి నదిలో కొంతమేర మునిగిన బోట్లను వెలికి తీసే కార్యక్రమం చేపట్టామన్నారు. తొలుత భారీ క్రెయిన్ల సహయంతో బోట్లు తీయాలని ప్రయత్నం చేసినా సాధ్యపడలేదన్నారు.

బ్యారేజ్​కు ఎలాంటి ప్రమాదం లేదు : చివరిగా ఇనుప గడ్డర్లతో రెండు పడవలను అనుసంధానించి అడ్డుపడిన పడవను వెలికి తీశారన్నారు. మూడు పడవలను బ్యారేజీ ఎగువన ఉన్న పున్నమి ఘాట్ వద్దకు తరలించారని తెలిపారు. సరికొత్త ప్రణాళికతో భారీ బోట్లను బెకెం ఇన్ ఫ్రా సంస్థ ఇంజినీర్లు, అధికారులు బయటకు తీశారని వివరించారు. ఇంకోక బోటు నదిలో ఉందేమోనన్న అనుమానంతో తనిఖీ చేయగా ఎలాంటి బోటు లేదని స్పష్టం చేశారు. భారీ పడవలు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టినా ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని కృష్ణారావు తెలిపారు.

ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి కుట్ర పన్నిన వారిని వదిలేది లేదు : మంత్రి నిమ్మల - Nimmala Inspected Prakasam Barrage

ఎట్టకేలకు ఫలించిన శ్రమ : కాగా ఈనెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు పోగా, మరో 3 భారీ బోట్లు, ఒక మోస్తరు పడవ గేట్ల వద్ద చిక్కుకున్నాయి. ఇవి బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీంతో భారీ పడవలను తొలగించేందుకు పలు ప్లాన్​ అమలు చేసిన అధికారులు రెండు పడవలను బయటకు తీశారు. తాజాగా ఇవాళ మూడో బోటును వెలికితీసి సఫలీకృతమయ్యారు.

బ్యారేజ్‌ని ఢీకొట్టిన బోట్లు వారివే- జగన్​ కుట్ర బట్టబయలైంది : కొల్లు రవీంద్ర - Minister Kollu Exclusive Interview

బ్యారేజ్‌ను బోట్లు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం - నిందితులకు 14 రోజుల రిమాండ్ - PRAKASAM BARRAGE BOATS CASE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.