ETV Bharat / state

సింహాచలంలో ఏం జరుగుతుందో!- చౌక ధరకే నెయ్యి సరఫరా- సీజ్ చేసిన అధికారులు - Ghee Seized in Simhachalam Temple

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Ghee Seized in Simhachalam Temple : తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కలకలం రేగడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల ప్రసాదాల తయారీపై దృష్టి సారించింది. ఈ క్రమంలో సింహాచలం ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని ఆహార భద్రతా అధికారులు సీజ్‌ చేయడం కలకం రేపింది. మిగిలిన సరకుల నాణ్యత నిర్థారించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

Ghee Seized in Simhachalam Temple
Ghee Seized in Simhachalam Temple (ETV Bharat)

MLA Ganta on Simhachalam Prasdam : దేవాలయాల్లో ప్రసాదాల తయారీతోపాటు దీపారాధన, స్వామివారి కైంకర్యాలకు ఆవునెయ్యి వినియోగిస్తారు. ప్రముఖ ఆలయాలకు ఏళ్లతరబడి ప్రముఖ సంస్థలు నెయ్యి సరఫరా చేస్తున్నాయి. కానీ వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరిట వారందరినీ పక్కన పెట్టేసింది. తమకు నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడంతో గుత్తేదారులు నాసిరకం నెయ్యి సరఫరా చేస్తున్నా అధికార యంత్రాంగం ప్రశ్నించలేని పరిస్థితి. తిరుమల ఘటన బయటపడిన తర్వాత ఆరోగ్య భద్రతా సిబ్బంది సింహాచలంలోనూ తనిఖీలు చేపట్టి పెద్దఎత్తున నెయ్యి సీజ్‌ చేయడం కలకలం రేపుతోంది.

సింహాచలం ఆలయానికి గతంలో విశాఖ డెయిరీ నెయ్యి సరఫరా చేసేది. 2019-20 మధ్య కిలో రూ.591 చొప్పున సరఫరా చేయగా ఆ తర్వాత ఏడాదీ అదే ధరకు సరఫరా చేసింది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ పేరిట తక్కువ ధరకు కొనుగోలు చేసింది. ఈ పరిస్థితుల్లో తాజాగా అన్నప్రసాదాల తయారీ విభాగాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెయ్యి ఎంతరేటుకు కొనుగోలు చేస్తున్నారని ఆరా తీశారు. కేవలం రూ.341కే గుత్తేదారుడు సరఫరా చేస్తున్నాడని తెలుసుకుని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Simhachalam Prasdam Ghee Issue : అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుందని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించగా అధికారులు నీళ్లు నమిలారు. ఆహార భద్రతా సిబ్బంది నెయ్యి శాంపిల్స్ సేకరించగా పసుపు రంగులో ఎలాంటి వాసన లేకుండా ఉండటాన్ని గుర్తించారు. శాంపిల్స్‌ ప్రయోగశాలకు పంపించామని అప్పటి వరకు ఈ నెయ్యి వినియోగించవద్దని సీజ్‌ చేశారు. సింహాచలం ఆలయానికి రూ.341కే నేతిని సరఫరా చేస్తున్న రైతు డెయిరీ అన్నవరం ఆలయానికి మాత్రం ఇదే బ్రాండ్, ఇదే నెయ్యిని రూ.500కు పైగా అందిస్తోంది. పరీక్షల నివేదిక వస్తే నేతి స్వచ్ఛత నిర్థారణ కానుంది. నెయ్యితోపాటు అన్నప్రసాదానికి వినియోగిస్తున్న ఇతర సామగ్రి శాంపిల్స్‌ సైతం ఆహార భద్రతా సిబ్బంది సేకరించింది.

మరోవైపు అన్నవరం సత్యదేవుని ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసే గుత్తేదారుడు ఒక్కో ఆలయానికి ఒక్కో ధర వసూలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. పైగా అన్నవరం దేవాలయానికి రెండేళ్లుగా ఒకే గుత్తేదారుడు నెయ్యి సరఫరా చేయడంపై చర్చనీయాంశమైంది. తిరుమల ఆలయంలో కల్తీ నెయ్యి వినియోగంతో అన్నవరం ఆలయంలో ప్రసాదం తయారీని స్థానిక ఎమ్మెల్యే వరపు సత్యప్రభ తనిఖీ చేశారు. సరుకుల టెండర్లు, స్టాక్, ల్యాబ్ రిపోర్ట్​లను పరిశీలించారు. పరీక్షలు చేయించేందుకు ప్రసాదం తయారు చేసే సరుకుల నమూనాలను అధికారులు సేకరించారు.

కల్తీ నెయ్యిని చిటికెలో కనిపెట్టేయొచ్చు - ఈ చిట్కాను పాటిస్తే సరి! - Ghee Purity Test At Home

గోవిందా అపచారం అపచారం - తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం దుర్మార్గమే! - Tirumala Laddu Issue Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.