ETV Bharat / state

విద్యుత్​ బిల్లు తగ్గాలా ! 'సోలార్​ రూఫ్​టాప్' అమర్చుకోండి - Solar Rooftop in Kurnool

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2024, 2:00 PM IST

Officers Awareness Program on Solar Rooftop : సోలార్​ రూఫ్​టాప్​తో విద్యుత్​ ఖర్చును తగ్గించుకోవచ్చని విద్యుత్తు శాఖ అధికారులు అంటున్నారు. ఈ అంశంపై గ్రామ, వార్డు స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. అయితే కాకుండా సోలార్​ రూఫ్​టాప్​తో ఆదాయాన్ని కూడా ఆర్జించవచ్చని ప్రజలకు వివరిస్తున్నారు.

solar rooftop
solar rooftop (ETV Bharat)

Officers Awareness Program on Solar Rooftop in AP : నెలకు 120 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తే రూ.1000కి పైగా బిల్లు వస్తోందా? అయితే సోలార్‌ రూఫ్‌టాప్‌తో రూ.338కి ఖర్చు తగ్గించుకోవచ్చని విద్యుత్తు శాఖ అధికారులు అంటున్నారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. వినియోగదారులపై భారం తగ్గించేందుకు కేంద్రం సూర్యఘర్‌ యోజనను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం అందరికి తెలిసిందే.

ఈ పద్ధతిలో ఇంటి పైకప్పు నుంచే విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. ఇంటి అవసరాలు తీరిన తర్వాత మిగిలిన విద్యుత్తుతో అదనపు ఆదాయం పొందొచ్చు అని ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ అంశంపై కర్నూలు జిల్లాలోని గ్రామ, వార్డు స్థాయిలో లైన్‌మెన్లు వారి పరిధిలో ఉన్నా ఇంటింటికెళ్లి వివరిస్తున్నారు. ఒక్కో లైన్‌మెన్‌ కనీసం నెలకు 10 మంది వినియోగదారులకు అవగాహన కల్పించాలని లక్ష్యం నిర్దేశించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లోనూ : ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ అంశం అధికారులు సర్వే నిర్వహించారు. ఎన్టీపీసీ (NTPC) ఆధ్వర్యంలో ఒక ఏజెన్సీని ఎంపిక చేసి ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్​ ప్యానల్స్​ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం సోలార్‌ విద్యుత్తు యూనిట్‌కు 3.74 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే విద్యుత్తుకు అత్యధికంగా యూనిట్‌కు రూ.9 చొప్పున ఎస్పీడీసీఎల్‌కు (APSPDCL) చెల్లిస్తున్నారు. సోలార్‌ విద్యుత్తు అందుబాటులోకి వస్తే యూనిట్‌కు 5 రూపాయల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుంది.

పావలా పెట్టుబడికి రూపాయి ప్రోత్సాహకాలా?- ఆ సంస్థపై జగన్​ సర్కార్​కు ఎంత ప్రేమో! - GOVT INCENTIVE FOR INDOSOL

రూ.30 వేల రాయితీ : అధికారిక గణాంకాల ప్రకారం, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,132,445 విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. రోజు 6.32 మెగావాట్ల విద్యుత్తు వినియోగం అవుతోంది. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదుసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచింది. శ్లాబ్‌లు, టారిఫ్‌లు మారుస్తూ రకరకాల పేర్లతో జగన్​ సర్కార్​ పేదలకు షాకిచ్చింది. విద్యుత్తు వినియోగదారులపై రూ. 100 కోట్ల భారం పడింది.

ఈ భారాన్ని తగ్గించాలని విద్యుత్తు వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యఘర్‌ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. 100 చదరపు అడుగుల స్థలంలో 120 యూనిట్లు ఉత్పత్తి చేసే ఒక కిలోవాట్‌ సామర్థ్యమున్న సోలార్​ రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు సుమారు 60 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇందులో 50% అంటే రూ.30 వేలను ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. మిగిలిన సొమ్మును బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవచ్చు.

కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్- బడ్జెట్​లో కొత్త సోలార్ పథకం

యాప్‌లో పేర్ల నమోదు : గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి పీఎం సూర్యఘర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఇంటి సర్వీసు నంబరుతో అనుసంధానం చేసి రిజిస్ట్రేషన్‌కు 1,190 రూపాయలు చెల్లించాలని తెలియజేశారు. ఆ సమాచారం విద్యుత్తు శాఖకు వెళ్తుంది. వారు నమోదు చేసుకున్న వారి ఇంటికొచ్చి సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసి మీటర్లు అమర్చుతారు. ఒక కిలోవాట్‌ ప్యానల్​ను అమర్చుకుంటే రూ.30 వేలు ఖర్చవుతుంది. ఆ మొత్తం నాలుగు సంవత్సరాల్లో విద్యుత్తు బిల్లు రూపేణా ఆదా అవుతుంది. ఆ తర్వాత ప్రతి యూనిట్‌ నుంచి ఆదాయమే పొందవచ్చని విద్యుత్తు శాఖ అధికారులు ప్రజలకు వివరిస్తున్నారు.

ప్రాజెక్టులు, కాంట్రాక్టులే కాదు విద్యుత్‌ కూడా జగన్ అస్మదీయులకే!- ఏకంగా 47వేల కోట్ల దోపిడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.