ETV Bharat / state

వైఎస్సార్సీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి - కూటమి ప్రభుత్వంపైనే ప్రజలు ఆశలు - people hope on alliance government - PEOPLE HOPE ON ALLIANCE GOVERNMENT

People Hope on Alliance Government: పట్టణాలు, నగరాలు అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీ కార్యక్రమాన్ని గత ఐదేళ్లు జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేశారు. పట్టణాల్లో సుందరీకరణ పనులు సంగతి అటుంచితే కనీసం మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

PEOPLE HOPE ON ALLIANCE GOVERNMENT
PEOPLE HOPE ON ALLIANCE GOVERNMENT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 9:17 AM IST

People Hope on Alliance Government: పట్టణాలు, నగరాలను ఆధునీకరించేందుకు 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2016లో ఎంపిక చేసిన పట్టణాలు, నగరాల్లో స్మార్ట్ సిటీ పథకం అమలు చేసింది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, ఆధునిక టెక్నాలజీతో అభివృద్ధి చేయడం కోసం ఈ పథకం కింద కొన్ని నగరాలకు కేంద్రం నిధులు సమకూర్చగా, మరికొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించింది. అందులో భాగంగా ఒంగోలులో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

నిధుల వినియోగానికి కలెక్టర్, ఎస్సీ, కమిషనర్, పట్టణ ప్రణాళిక అధికారి, ఆర్డీవో, పురపాలక రీజనల్ డైరెక్టర్తో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చేసిన తీర్మానాలకు అనుగుణంగా పనులు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో 4 కోట్లతో మెప్మా భవన్‌లో కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌ ప్రారంభించారు. దీని ద్వారా నగరంలోని పబ్లిక్ అడ్రస్ సిస్టం, జియోట్యాగింగ్ ద్వారా తాగు నీటి ట్యాంకర్లు సరఫరా, వీధి దీపాల నిర్వహణ, ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంలను అనుసందానం చేశారు.

తుపాన్ల సమయంలో ఏకకాలంలో ప్రజల్ని అప్రమత్తం చేయడానికి పబ్లిక్ ఆడ్రస్ సిస్టం ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ సిటీ ప్రతిపాదనల్లో ట్రంక్‌రోడ్డును ఆదర్శ మార్గంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. ఆ మార్గంలో ఇరువైపులా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయడం, వీధి వ్యాపారులకు నిర్ణీత స్థలం కేటాయించడం, లైటింగ్‌లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దటం లాంటి పనులకు 3 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ పనులన్నీ అటకెక్కాయి. గత ఐదేళ్లలో కనీసం మౌలిక సదుపాయలు కల్పించలేదని నగరవాసులు మండిపడుతున్నారు.

'పరదాల వీరుడికి 986 మంది రక్షణ - ఇది ఒక్క రూపాయి సీఎం భద్రతా కథా చిత్రమ్' - High Security For EX CM Jagan

కమాండ్ కంట్రోల్‌ రూంలో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, మానిటరింగ్ సిస్టం పూర్తిస్థాయిలో పనిచేయడంలేదు. నగరంలో ఈ- బైస్కిల్ విధానం, దక్షిణ బైపాస్ కూడలి వద్ద మైథిలాజికల్ పార్కు, ఊరచెరువు స్థలంలో పార్కు అభివృద్ధి పనులు అటకెక్కాయి. స్మార్ట్‌ సిటీ పథకం కింద మంజూరైన 4 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికీ ఖాతాల్లోనే నిరూపయోగంగా ఉన్నాయి. నిధులు పూర్తిగా వినియోగిస్తే తరువాత సంవత్సరం మళ్లీ నిధులు కేటాయింపు జరిగేది.

మరోవైపు ఇప్పటికే నగరంలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఇరుకైన రహదారులు, శిథిలావస్థకు చేరిన పార్కులు, మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడం వంటి సమస్యలతో పట్టణవాసులు సతమతమవుతున్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

"గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో స్మార్ట్ సిటీ పథకం కింది ఒంగోలు నగరానికి 20 కోట్ల రూపాయల పనులు వచ్చాయి. దానిని 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ రద్దుచేయడం జరిగింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సైతం సద్వినియోగం చేసుకోలేదు". - శంకరరావు, కార్పొరేటర్‌

పన్నుల పెంపుతో ప్రజల్ని పీల్చిపిప్పి చేసిన జగన్‌- గుర్తు చేసుకుంటున్న బెజవాడ వాసులు - Vijayawada People hopeful TDP Govt

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.