Violation Of Election Rules By YSRCP: సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా వైఎస్సార్సీపీ నేతలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇన్ని రోజులు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నేతలు తాజాగా నిబంధనలు పాటించాలంటే జీర్ణించుకోలేకపోతున్నారు.
వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు- అచ్చెన్న
Nimmagadda Rameshkumar Fired on YSRCP: కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సీఎం జగన్ (CM Jagan), ఎమ్మెల్యే జగ్గిరెడ్డి (MLA Jaggireddy) ఫొటోలతో ఉన్న 60 అడుగుల కటౌట్‌ను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మంగళవారం గమనించారు. దీనిపై రమేశ్‌కుమార్ సి-విజిల్ యాప్ (CVIGIL App)లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎన్నికల అధికారులు వైఎస్సార్సీపీ కటౌట్లను తొలగించారు.
వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు- అచ్చెన్న
వైఎస్సార్సీపీ కటౌట్‌ను గమనించిన రమేష్ కుమార్: మంగళవారం తణుకు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న రమేశ్‌కుమార్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద ఉన్న కటౌట్‌ను గమనించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయనే భద్రతా భావాన్ని ప్రజలకు కల్పించాలని ఆ దిశగా ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగీ విధులు నిర్వర్తించాలన్నారు. అలా చేయకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతామని రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా కటౌట్ తొలగించకపోవడం వైఫల్యమేనని, రావులపాలెం గోదావరి వంతెన సమీపంలోని చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారులకు 100 అడుగుల దూరంలోని వైఎస్సార్సీపీ కటౌట్ (YSRCP Cutout) కనిపించలేదా అని రమేశ్‌కుమార్ ప్రశ్నించారు. నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్న పౌరసరఫరా పంపిణీ వాహనాలపై ఇప్పటికీ సీఎం చిత్రాలు తొలగించలేదని ఫిర్యాదులు వస్తున్నాయని మండిపడ్డారు. పిల్లలు చదువుకునే పుస్తకాలు, చిక్కీలు, బుక్స్ బ్యాగులు, ధ్రువపత్రాలు, రైతుల పొలాల్లో సరిహద్దు రాళ్ల వరకు అన్నింటిపైనా జగన్ చిత్రాలు దర్శనమిస్తున్నాయని రమేష్ కుమార్ ఆరోపించారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘన..విజయసాయిపై విశాఖ జేసీకి ఫిర్యాదు
ప్రవర్తనా నియమావళి అమలులో తాను గమనించిన వైఫల్యాన్ని సివిజిల్ యాప్‌లో చిత్రీకరించి పోస్ట్ చేశానని, అదే విధంగా పౌరులంతా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని నియమావళి ఉల్లంఘనలను నమోదు చేయాలని కోరారు. పౌరులంతా ఈ విజిల్ ఫిర్యాదులు చేయడం మొదలుపెడితే రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ, ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందని దీని కోసం ప్రతి పౌరుడు ముందుకు రావాలని, వీలయినంత ప్రజాస్వామ్య పరిరక్షణకు సహకరించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపున రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.