ETV Bharat / state

సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా అందించవద్దు: నిమ్మగడ్డ రమేష్ కుమార్

Nimmagadda Ramesh Kumar Comments: సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా అందించవద్దని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. వాలంటీర్లను ఓటర్ల నుంచి పూర్తిగా నిరోధించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిపై ఉందన్నారు. వాలంటీర్లు రాజకీయ నేతల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం, ఒక పార్టీకి మేలు చేసే పనులు చేపట్టడం వంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని అన్నారు.

Nimmagadda_Ramesh_Kumar_Comments
Nimmagadda_Ramesh_Kumar_Comments
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 7:22 PM IST

Nimmagadda Ramesh Kumar Comments: రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా అందించవద్దని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (Citizens For Democracy) డిమాండ్‌ చేసింది. గ్రామ వార్డు సచివాలయాలకు చెందిన దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లను పూర్తిగా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించడాన్ని తాము స్వాగతిస్తున్నామని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి, విశ్రాంత సీనియర్‌ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) అన్నారు.

ఎన్నికలు పూర్తి అయ్యేవరకు పథకాలను అందించవద్దు: ఈ అంశంపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ద్వారా ఇది సాధ్యమైందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు లబ్ధిదారుల సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా అందించవద్దని ప్రత్యామ్నాయ పద్ధతులలో అందించాలని కోరారు. ఇప్పటికీ కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీకి చేరిన సమాచారం ప్రకారం వాలంటీర్లు వారి సామీప్యత కారణంగా ఓటర్లను ప్రభావితం చేస్తూనే ఉన్నారని తెలిపారు. 171 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని చాప్టర్ 9 నేరాల కింద చర్య తీసుకోదగిన నేరాలు కొనసాగుతున్నాయని అన్నారు.

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పిటిషన్​పై హైకోర్టులో విచారణ - తగిన చర్యలపై ఈసీకి ఆదేశాలు

ఓటర్లకు తాయిలాలను పంపిణీ చేస్తున్నారు: ఓటర్లకు పారితోషకాలు, డబ్బులు, చీరలు (Gifts Distribution to Voters) తదితర తాయిలాలను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్​ఫర్​ (Direct Benefit Transfer) ప్రయోజనాలు వాలంటీర్ల ద్వారా జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. పింఛన్లు, ప్రయోజనాలు, రేషన్ పంపిణీలో వాలంటీర్లను కొనసాగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలు అపహాస్యమవుతాయని తెలిపారు. వాలంటీర్లు ఓటర్ల నుంచి పూర్తిగా నిరోధించాలని, తక్షణ ప్రభావంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన ప్రభావాన్ని చూపకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (Andhra Pradesh Chief Electoral Officer)పై ఉందన్నారు.

అటువంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలి: రిట్ పిటిషన్ 6419/2024లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో చేసిన పరిశీలనను రాష్ట్రం తప్పనిసరిగా పాటించి అమలు చేయాలని కోరారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన లక్ష్యాలను సాధించడానికి ఎస్​ఈసీ (State Election Commission)కు ఉన్న విశేష అధికారాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. వాలంటీర్లు రాజకీయ నేతల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం, ఒక పార్టీకి మేలు చేసే పనులు చేపట్టడం వంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షించి తగిన చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల్లో వాలంటీర్ల ద్వారా లబ్ధి పొందాలని చూస్తే ఈసీ ఆదేశాలు ధిక్కరించినట్లే: నిమ్మగడ్డ రమేష్​కుమార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.