ETV Bharat / state

పేదలకు గుడ్​న్యూస్ -​ ఈ సంక్రాంతికి కొత్త రేషన్​ కార్డులు

రేషన్​ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అనుమతి - నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన వారందరికీ రేషన్​ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. అలాగే రేషన్​ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కల్పించింది. అందుకోసం ఈ నెల 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. అర్హత ఉన్న వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాలన్నీ పరిశీలించిన తర్వాత అర్హత ఉన్న వారికి సంక్రాంతికి నూతన కార్డులు మంజూరు చేస్తారని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో రేషన్‌కార్డులపై వైఎస్సార్​సీపీ రంగులతోపాటు జగన్‌ బొమ్మను ముద్రించారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు. దీనికి బడ్జెట్‌ కూడా విడుదలైంది.

కొత్త జంటలకూ రేషన్ కార్డు - కుటుంబ సభ్యుల చిత్రాలతో సరికొత్తగా!

అన్నింటికీ రేషన్ కార్డులే : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరుతో పాటు, ఉన్న వాటి సవరణకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులకు పింఛను మంజూరు చేయాలన్నా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలన్నా, దీపం-2 పథకం వర్తింపజేయాలన్నా ప్రాథమికంగా బియ్యం కార్డు కలిగి ఉండాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇవి తప్పకుండా ఉండాలి.

ఏపీలో ట్రాన్స్‌జెండర్లకు స్వయం సహాయక బృందాలు- ప్రత్యేకంగా రేషన్ కార్డులు

పెద్ద ఎత్తున విమర్శలు : ఇంతటి కీలకమైన కార్డుల మంజూరును గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులకూ అవకాశం ఇవ్వకపోవడంతో వేలాది మంది సంక్షేమ పథకాల లబ్ధికి దూరమయ్యారు. ఈ తప్పిదాన్ని సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే ఉన్న పాత కార్డులను కాదని అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చిత్రాలు, ఆ పార్టీ గుర్తులతో ముద్రించి ఇచ్చారు. ఇందుకోసం చాలా డబ్బులు వృథా చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

బెదిరించి అరబిందోకు వాటా రాయించుకున్నారు- తరువాతే రూ.45 వేల కోట్ల బియ్యం ఎగుమతి

కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశం : అప్పట్లో కొత్తవి ఇవ్వకపోగా ఆరంచెల విధానంలో వడపోసి అప్పటికే ఉన్న కార్డులను తొలగించారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వివాహం జరిగితే విభజన చేసుకునేందుకూ అనుమతి ఇవ్వలేదు. పేర్ల తొలగింపు, చేర్పులకు అవకాశం లేకుండా పోయింది. దీంతో అప్పట్లో ప్రభుత్వ సంక్షేమ, రాయితీ పథకాలేకపోయారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంతో బియ్యం కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ వ్యవస్థలు పతనం! - కాకినాడ పోర్టు కేంద్రంగా భారీగా తరలుతున్న సరుకు

ఇక ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ బెనిఫిట్‌ కార్డు - ఏఐ ఆధారంగా పథకాల వర్తింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.