E-Pahara Police Patrolling: విజయవాడలో నేరాల నియంత్రణకు గస్తీ విధానంలో సరికొత్త మార్పులకు పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ-పహారా పేరుతో కొత్త గస్తీ విధానాన్ని సోమవారం విజయవాడ కమిషనరేట్‌లో సీపీ రాజశేఖరబాబు లాంఛనంగా ప్రారంభించారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి విక్రయదారుల ప్రాంతాల్ని మ్యాపింగ్ చేసి నేరాలపై ఈ-నిఘా పెట్టారు. దొంగతనాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగే జరిగే ప్రదేశాలనూ అనుసంధానం చేసి సంఘ వ్యతిరేక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.
విజయవాడలోని అన్ని ఠాణాల పరిధిలో పోలీసుల గస్తీ విధానంలో సాంకేతికతను జోడించి ఈ-పహారాను తీసుకొచ్చారు. కానిస్టేబుళ్లు తమ మొబైళ్లలో దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుని వారికి కేటాయించిన ప్రాంతాల్లో గస్తీ తిరుగుతారు. మొబైల్‌లోని జీపీఎస్ ఆధారంగా ఏ పాయింట్ ఎన్ని గంటలకు వెళ్లారు? అన్నది పక్కాగా రికార్డు అవుతుంది. దీని ద్వారా గస్తీ తిరిగే కానిస్టేబుల్ తన విధులు నిర్వహిస్తున్నారా లేదా అని ఉన్నతాధికారులు గమనిస్తూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేసేందుకు వీలు కలుగుతుంది.
బ్లేడ్ బ్యాచ్, గంజాయి విక్రయదారులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి వివరాలు ఈ-పహారాకు అనుసంధానించి వారి కదలికలపై నిఘా పెడతారు. ఆయా పాయింట్లలో గస్తీకి వెళ్లిన సిబ్బంది తప్పనిసరిగా ఫొటో తీసి, అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ-పహారాలో తాళం వేసిన ఇళ్లపైనా నిఘాను అనుసంధానం చేయబోతున్నారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు దృష్టి పెట్టారు. ఓ సంస్థతో ప్రతి కూడలి వద్ద రద్దీ గురించి అధ్యయనం చేయిస్తున్నారు.
"గస్తీతోపాటు ట్రాఫిక్ సమస్యపై కూడా సాంకేతికత ఉపయోగించి ముందుకు సాగుతున్నాం. నగర ట్రాఫిక్‌పై అధ్యయనం చేస్తున్నాం. ఓ సంస్థతో ప్రతి కూడలి వద్ద రద్దీ గురించి విశ్లేషణ చేయిస్తున్నాం. ఏ జంక్షన్ వద్ద ఎంత దూరం మేరకు ట్రాఫిక్ నిలిచిపోయిందనే వివరాలను ప్రతి 15 నిమిషాలకు తెలుసుకుని తద్వారా కంట్రోల్ రూమ్ నుంచే రద్దీ నియంత్రిస్తాం. ఏడాది వ్యవధిలోగా ఎక్కడెక్కడ ఎంత మేర రద్దీ అనే దానిపై శాస్త్రీయ పరిశీలన చేయిస్తాం. ఎల్.హెచ్.ఎం.ఎస్.ను పౌరులు వినియోగించుకోవాలి. దీనిని కాదంటే గస్తీ సిబ్బంది నిఘా పెడతారు. ఇకపై ఈ-పహరాలో తాళం వేసిన ఇళ్లపై సాంకేతికతతో నిఘా అనుసంధానించి నేరాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంటాం." - రాజశేఖరబాబు, నగర పోలీస్ కమిషనర్
11 ఏళ్లు విధులు - జాగిలం శాండీ పదవీ విరమణ - సన్మానించిన పోలీసులు - POLICE DOG SANDY RETIREMENT