Narasapuram MPDO Venkataramana Missing Case : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం కేసులో పోలీసుల దర్యాఫ్తు వేగవంతం చేశారు. ఏలూరు కాల్వలోకి వెంకటరమణ దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయన మొబైల్ ట్రాక్ చేయగా విజయవాడ మధురానగర్ ఏలూరు కాల్వ దగ్గర సిగ్నల్ కట్ అయినట్టు గుర్తించారు. పూర్తిస్థాయిలో వెంకటరమణ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే ఎంపీడీవో వెంకటరమణ నిన్న (మంగళవారం రోజు) ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తాను సూసైడ్ చేసుకుంటున్నట్టుగా కుటుంబ సభ్యులకు వాట్సప్ ద్వారా మెసెజ్ పంపాడు. అందులో ‘ఈ రోజు నా పుట్టిన రోజు. నేను చనిపోయే రోజు కూడా’ అంటూ రాయడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
బాలిక అదృశ్యం ఘటనలో చర్యలు - ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు - Action Against nandyal Police
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, వెంకటరమణారావు విజయవాడ సమీప కానూరు మహదేవపురం కాలనీలో నివాసముంటున్నారు. నరసాపురంలో ఎంపీడీవోగా పని చేస్తున్న ఆయన సెలవు రోజుల్లో ఇంటికి వస్తుంటారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టి కానూరు వచ్చారు. 15న మచిలీపట్నంలో పని ఉందంటూ ఇంట్లో చెప్పి వెళ్లారు. ఆరోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి, తాను బందరులో ఉన్నానని, ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని తెలిపారు. తర్వాత అతని ఆచూకీ తెలియకపోగా, ఫోన్ కూడా పని చేయలేదు.
అర్ధరాత్రి దాటాక ‘నా పుట్టిన రోజైన 16వ తేదీయే.. నేను చనిపోయే రోజు కూడా. అందరూ జాగ్రత్త’ అని భార్య ఫోన్‌కు మెసేజ్ పంపించారు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు మంగళవారం ఉదయం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రమణారావు వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు విజయవాడ, మచిలీపట్నంలో గాలిస్తున్నారు.
పవన్‌కల్యాణ్‌కు లేఖ రాసిన నరసాపురం ఎంపీడీవో :
అయితే నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు లేఖ రాశారు. నిందితులు రూ.55 లక్షలు ఫెర్రీ లీజు బకాయిలు ఉన్నారని తెలిపారు. గత చీఫ్ విప్ ప్రసాదరాజు అండదండలతో నిందితులు డబ్బులు చెల్లించలేదని వాపోయారు. గత మూడున్నర నెలల నుంచి నిందితులు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయకపోయినా మానసిక క్షోభ అనుభవిస్తున్నాని తెలిపారు.
బకాయిలు రికవరీ చేయకవపోవడం వలన నన్ను బాధ్యుడిని చేసే అవకాశం ఉందని, తనకు ఉద్యోగమే జీవనాధారమని వెల్లడించారు. నిందితులు బకాయి డబ్బు చెల్లించేలా చూసి నాకు న్యాయం చేయాలని కోరారు. 33 ఏళ్లు నిజాయతీతో పనిచేశాను, ఆఖరిలో నా కర్మ ఇలా అయ్యిందని వాపోయారు. నా పింఛన్ ప్రతిపాదన వచ్చేలా చేసి నా భార్యకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నానట్లు లేఖలో పేర్కొన్నారు.
ఆగిన గాలింపు చర్యలు - మూడు రోజులుగా వెతుకుతున్నా లభించని బాలిక ఆచూకీ - Search operation Stopped
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ - విజయవాడ యువతి ఆచూకీ లభ్యం - Vijayawada Police on Girl Missing