ETV Bharat / state

వీడని ఎంపీడీవో మిస్సింగ్​ మిస్టరీ - ఏమయ్యారో? ఎక్కడున్నారో? - Narasapuram MPDO Missing Case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 20, 2024, 10:47 AM IST

Narasapuram MPDO Missing Case : అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ ఇంకా లభించలేదు. పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, పోలీసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో ఎంపీడీవో ఏమయ్యారన్న విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

mpdo_missing_case
mpdo_missing_case (ETV Bharat)

Narasapuram MPDO Venkataramana Missing Case : గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణారావు ఆచూకీ ఇంకా లభించలేదు. ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏలూరు కాలవను జల్లెడపడుతున్నా ఇంత వరకు ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో ఎంపీడీవో ఏమయ్యారన్న ఆందోళన నెలకొంది. ఒకవేళ ఆయన కాలవలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికే మృతదేహం తేలే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఏలూరు కాలవలో దట్టమైన గుర్రపు డెక్క గాలింపు చర్యలకు ఆటంకంగా మారింది. కాలవలోని గుర్రపు డెక్క, కాలవ పరిసర ప్రాంతాల్లో ఏవైనా మృతదేహాలు ఉన్నాయా? అన్నది పరిశీలించేందుకు పోలీసులు డ్రోన్లు తెప్పించారు. అయితే జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా డ్రోన్లు ఎగరవేయడం సాధ్యం కాలేదని అధికారులు పేర్కొన్నారు.

వీడని ఎంపీడీవో మిస్సింగ్​ మిస్టరీ - ఏమయ్యారో? ఎక్కడున్నారో? (ETV Bharat)

ఇంకా లభించని ఎంపీడీవో ఆచూకీ - ఆ రెండు ఫోన్‌ కాల్స్‌పై పోలీసుల దర్యాప్తు - narasapuram mpdo missing case
కృష్ణా ఎస్పీ గంగాధర్‌ స్వయంగా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. మరోవైపు ఎంపీడీఓతో పాటు ఆయన కుటుంబసభ్యులు కొన్ని నంబర్లకు 5 లక్షల వరకు నగదు పంపించినట్లు పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తులు సైబర్‌ నేరస్తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఖాతాల వివరాలను తెప్పించి పరిశీలిస్తున్నారు. సైబర్‌ నేరస్తులకు సంబంధించినవి అయితే ఏ విధంగా ఎంపీడీఓను బురిడీ కొట్టించారు? అన్న దానిని పరిశోధిస్తున్నారు. ఇందులో రేవు గుత్తేదారు ప్రమేయం ఉందా? అన్న కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి మరో బృందం నరసాపురం వెళ్లి దర్యాప్తు చేస్తోందని పోలీసులు తెలిపారు.

నరసాపురం ఎంపీడీవో కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు - police search for Narasapuram mpdo

ఇప్పటి వరకు వెంకటరమణారావు ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. ఎంపీడీవో ఫోన్​ సిగ్నల్​ చివరగా ట్రాక్​ అయిన విజయవాడ నగరంలోకి మధురానగర్​ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోలీసు, ప్రైవేటు కెమెరాల్లో నమోదైన దృశ్యాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ బృందం నిశితంగా పరిశీలిస్తోంది. నగరంలోని దేవీనగర్​ వంతెన కింద 15వ తేదీ రాత్రి 10.20 నిమిషాల సమయంలో నడిచి వెళ్తున్న దృశ్యం ఓ ప్రైవేట్​ సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంకట రమణారావు ఆచూకీ దొరుకుతుందేమో అన్న ఆశతో చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని కెమెరాల్లోని పుటేజీని పరిశీలిస్తున్నారు.

నరసాపురం ఎంపీడీవో అదృశ్యం కేసులో కీలక మలుపు - పవన్ కల్యాణ్​కు బాధితుడి లేఖ - Narasapuram MPDO Missing case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.