Nara Lokesh Praja Darbar : వైఎస్సార్సీపీ నేతలు బెదిరిస్తున్నారని, మరి కొందరు తమ ఆస్తులను కాజేసేందుకు యత్నిస్తున్నారని పలువురు బాధితులు మంత్రి లోకేశ్ ఎదుట మొర పెట్టుకున్నారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం (Sep 17) నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు నేరుగా లోకేశ్‌ను కలిశారు. వారి సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆయా సమస్యలు పరిష్కరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాధితులకు తమకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు.
Harassment of YSRCP leader : అప్పుగా తీసుకున్న రూ.17 లక్షలు తిరిగి చెల్లించకుండా వైఎస్సార్సీపీ నాయకుడు బెదిరిస్తున్నారని ఉండవల్లికి చెందిన కూనపురెడ్డి రమేష్ మంత్రి లోకేశ్‌కి వినతి పత్రం అందజేశారు. దేవినేని అవినాష్ అండతో తమ సొమ్మును చెల్లించలేదని వాపోయారు. విజయవాడకు చెందిన బీవీ సుబ్బారెడ్డి తన వద్ద రూ.17 లక్షలు అప్పుగా తీసుకున్నారని పేర్కొన్నారు. తిరిగి చెల్లించమంటే దేవినేని అవినాష్ అనుచరులతో ప్రామీసరీ నోట్లను, చెక్కులను లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని వాపోయారు.
వైఎస్సార్సీపీ సర్కార్ వైఫల్యం - ప్రజా దర్బార్‌కు వినతుల వెల్లువ - YSRCP Victims at Praja Darbar
Illegal cases against victims : నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీ నేతలు, కౌన్సిలర్లు కంపా అరుణ్, బత్తుల అనిల్ వేధింపులకు పాల్పడుతున్నారని బాపట్ల జిల్లా చీరాలకు చెందిన వల్లెపు బాల అంకమరావు మంత్రి లోకేశ్ దృష్టికి తెచ్చారు. తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది తన ఇంట్లో చోరీ జరిగిందని కేసు పెడితే పోలీసులు ఎవరూ పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు.
ఆళ్ల నాని పరిహారం అందకుండా చేశారు - మంత్రి లోకేశ్‌కు బాధితుడి మొర - Lokesh Praja Darbar 17th Day
భరోసా ఇచ్చి ధైర్యం చెప్పిన లోకేశ్ : గుంటూరు జిల్లా మంగళగిరిలో పనిచేసే పశ్చిమబంగాకు చెందిన గోబెడ్‌కు 650 గ్రాముల బంగారం ఇచ్చి ఆభరణాలు చేయమంటే దాంతో పరారయ్యాడని వ్యాపారులు భువనగిరి రవికుమార్, కిరణ్, నాగసాయి మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. మంగళగిరి ఆటోనగర్‌లోని తమ 5 సెంట్ల స్థలాన్ని పటాన్ అలీబాషా, పటాన్ అశోక్ అన్యాక్రాంతం చేశారని మజీద్ లోకేశ్‌కు తన ఆవేదనను చెప్పుకున్నారు.
'ప్రజాదర్బార్' అనూహ్య స్పందన - సమస్యల పరిష్కారానికి లోకేశ్ భరోసా - Nara Lokesh Praja Darbar