ETV Bharat / state

'అద్భుత విజయాన్ని అందించిన అశేష ప్రజానీకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు' - Nara Lokesh On NDA Success in election results

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 5, 2024, 12:41 PM IST

Nara Lokesh On NDA Success in election results : కూటమి విజయంపై తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్​ హయాంలో ప్రజలు పడ్డ ఇబ్బందులకు నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందన్నారు. తమను నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజలకు తమ పాలనతో సుభిక్షమైన రాష్ట్రన్ని నెలకొల్పుతామని లోకేష్​, అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.

nara_lokesh_on_nda_success
nara_lokesh_on_nda_success (ETV Bharat)

Nara Lokesh On NDA Success : జనం ఎగురవేసిన జయకేతనం ఈ అఖండ విజయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యమన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి అద్భుత విజయాన్ని అందించిన అశేష ప్రజానీకానికి లోకేష్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అద్భుత విజయం ప్రజా ఆకాంక్షలకు ప్రతిరూపమని కొనియడారు. సమష్టిగా పని చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతామని స్పష్టం చేశారు. ఆదరించిన ప్రజలు, అహర్నిశలు పని చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Atchannaidu Comments on NDA Victory : గత అయిదేళ్లుగా ప్రజలను జగన్​రెడ్డి ఎంత వేధించాడనే దానికి నేటి ఫలితాలు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలను ఎంతలా ఇబ్బందులు పెట్టారో వైఎస్సార్సీపీకి వచ్చిన ఓట్లు చెప్తున్నాయని ధ్వజమెత్తారు. రౌడీలు, గూండాలతో పాలించి ఆర్ధికంగా, మానసికంగా ప్రజలంజ హింసించారని దుయ్యబట్టారు. వాలంటరీ వ్యవస్థలను పెట్టి ఆరాచకాలు చేశారని మండిపడ్డారు. అది చేశాం, ఇది చేశామని వైఎస్సార్సీపీ చేసిన అబద్దపు ప్రకటనలను ప్రజలు నమ్మలేదన్నారు. నేటితో అరాచక ప్రభుత్వానికి స్వస్తి, ప్రజాలచే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు.

రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు - సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది: చంద్రబాబు - Chandrababu Naidu on NDA Victory

ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం కట్టబెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఈ సందర్బంగా మీడియా సహా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ ఐదేళ్ల తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ఐదేళ్లలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని చెప్పారు. సహజ సంపద విచ్చలవిడిగా దోచుకున్నారన్నారు. తాము మిగులు విద్యుత్‌ తీసుకొస్తే వైఎస్సార్సీపీ నాశనం చేసిందని ధ్వజమెత్తారు. 9 సార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచేసి ప్రజలపై భారం మోపారని తెలిపారు.

39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ - గెలుపు దిశగా నారా లోకేశ్​ - Nara Lokesh Win in Mangalagiri

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.