ETV Bharat / state

మరో రెండు నెలల్లో మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారుతాయి: నారా బ్రాహ్మిణి - నారా బ్రాహ్మిణి

Nara Brahmani meeting with handloom workers: గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా బ్రహ్మణి పర్యటించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి కేంద్రం, ఆత్మకూరులోని చేనేత డైయింగ్ షేడ్​ను ఆమె సందర్శించారు. టాటా సంస్థ తనేరా, ఎన్నారై తెలుగుదేశం పార్టీ సహకారంతో ఏర్పాటు చేసిన వీవర్ శాలను నారా బ్రాహ్మణి, తనేరా సీఈవో అంబుజ్ నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బ్రహ్మిణి, మరో రెండు నెలల్లో మంగళగిరి రూపురేఖలు మారబోతున్నాయని స్పష్టం చేశారు.

Nara Brahmani
Nara Brahmani
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 8:19 PM IST

Nara Brahmani meeting with handloom workers: మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి పర్యటించారు. చేనేతను దత్తత తీసుకుంటా అని లోకేశ్ మాటిచ్చిన నేపథ్యంలో, చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు బ్రాహ్మణి ముందుకు వచ్చారు. ఆత్మకూరులోని చేనేత డైయింగ్ షేడ్ ని ఆమె పరిశీలించారు. చేనేత డైయింగ్ కార్మికులను అడిగి విధానాన్ని తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేనేత డైయింగ్ కార్మికులుగా పనిచేస్తున్నా తమకు గుర్తింపు లేదన్న కార్మికులు , తమ కష్టం ఎక్కువ వచ్చే ఆదాయం తక్కువని ఆవేదన వ్యక్తంచేశారు. డైయింగ్ ప్రక్రియలో వాడే కెమికల్స్ వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నా తమకు తెలిసిన పని ఇది ఒక్కటే కాబట్టి దీనినే నమ్ముకొని పనిచేస్తున్నామని బ్రాహ్మణి దృష్టికి తీసుకొచ్చారు.

స్త్రీశక్తి కేంద్రాన్ని సందర్శించిన బ్రహ్మణి: పేద మహిళల ఆర్థికాభివృద్ధే లోకేశ్ లక్ష్యమని నారా బ్రహ్మణి స్పష్టంచేశారు. నిరంతరం మంగళగిరి అభివృద్ధి గురించే నారా లోకేశ్ ఆలోచన అని ఆమె తేల్చిచెప్పారు. మంగళగిరిలో స్త్రీశక్తి కేంద్రాన్ని బ్రహ్మణి సందర్శించారు. మహిళలతో మాట్లాడి వారికి అందుతున్న శిక్షణ గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. నారా లోకేశ్ నెలకొల్పిన స్త్రీశక్తి ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటుంది. మంగళగిరి మహిళలకు స్త్రీశక్తి ఎంతగానో దోహదపడుతుందని బ్రహ్మణి పేర్కొన్నారు. ఇప్పటికే 47 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం జరిగిందన్నారు. మంగళగిరి, తాడేపల్లి పట్టణాలతో పాటు దుగ్గిరాలలో ప్రతి రోజు 13 బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం నారా లోకేశ్ 27 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

మంగళగిరి వైఎస్సార్సీపీలో వర్గపోరు - మహిళకు సీటు కేటాయించే అవకాశం

వీవర్ శాల ప్రారంభం: మంగళగిరిలో టాటా సంస్థ తనేరా, ఎన్నారై తెలుగుదేశం పార్టీ సహకారంతో ఏర్పాటు చేసిన వీవర్ శాలను నారా బ్రాహ్మణి, తనేరా సీఈవో అంబుజ్ నారాయణ ప్రారంభించారు. వీవర్ శాలలోని మగ్గలాను పరిశీలించారు. అధునాతన జాకాట్ మగ్గంపై నేసిన చీరను కట్ చేశారు. వీవర్ శాలలో తయారైన చీరల నాణ్యతను నారా బ్రాహ్మణి పరిశీలించారు. చాలా అధునాతనంగా ఉన్నాయని కితాబిచ్చారు. తనకు ఇష్టమైన రంగుల చీరను చూసి ఆనందం వ్యక్తం చేశారు. జాకట్ మగ్గాలపై శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అంతకుముందు చీరలకు వేస్తున్న రంగులను నారా బ్రాహ్మణి పరిశీలించారు. రంగుల అద్దకంపై కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఏటా 10శాతం మంది కార్మికులు నేత పని నుంచి వెనక్కి వెళ్లిపోతున్నారని, అలాంటి వారందర్నీ ఆదుకునేందుకు టాటా సంస్థతో కలసి వీవర్ శాల ఏర్పాటు చేశామన్నారు. 13వేల మగ్గాలకు గాను ప్రస్తుతం 3వేలే ఉన్నాయన్నారు. మంగళగిరి చీరలు తమ కుటుంబం సభ్యులందరికీ నచ్చాయన్నారు. చేనేత వస్త్రాలు, స్వర్ణకారుల ఆభరణాలకు ప్రపంచ స్థాయి మార్కెట్ కల్పిస్తామన్నారు. టాటా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తనేరా చేనేతను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఈవో అంబుజ్ నారాయణ చెప్పారు. ప్రస్తుతం తమ సంస్థ ఆధ్వర్యంలో 30 వీవర్ శాలలు నడుస్తున్నాయని, మరో 10 ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

మంగళగిరి భూములపై వైసీపీ కన్ను - ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పంచుమర్తి అనురాధ

మరో రెండు నెలల్లో మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారుతాయి: నారా బ్రాహ్మిణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.