ETV Bharat / state

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలు అమలు: భువనేశ్వరి - Nara Bhuvaneswari tours

Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందినవారి కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. ప్రతి కుటుంబాన్నీ కలుస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుని ఆర్థిక సాయం చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కొనసాగిస్తున్నారు.

nara_bhuvaneswari.
nara_bhuvaneswari.
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 7:47 PM IST

Updated : Feb 1, 2024, 8:52 PM IST

Nara Bhuvaneswari Nijam Gelavali Yatra : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ సమయంలో కలత చెంది మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మరణించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి మృతుని కుటుంబీకులకు ఆర్థికంగా సాయం చేయడంతో పాటు, ఆ కుటుంబాల్లో ధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలు అమలు: భువనేశ్వరి

ప్రకాశం జిల్లాలో నారా భువనేశ్వరి యాత్ర - పలు కుటుంబాలకు ₹3లక్షలు ఆర్థిక సాయం

Nellore District: నెల్లూరు జిల్లాలోని కందుకూరు, ఉదయగిరి, నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి కలిశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలతో కొద్దిసేపు గడిపారు. కార్యకర్తల కుటుంబాలను పరమార్శించారు. ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయంగా అందజేశారు. పార్టీ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు అబ్దుల్ అజీజ్, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో భువనేశ్వరి "నిజం గెలవాలి" - బాధిత కుటుంబాలకు 3లక్షల ఆర్థిక సాయం

టీడీపీ అండగా ఉంటుందని భరోసా: జిల్లాలోని కొండాపురం మండలంలోనూ నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక కొమ్మిలో మృత్యువాత పడిన తాటిపర్తి సుధాకర్ కుటుంబాన్ని పరమార్శించారు. మృతుని భార్య వెంగమ్మకు 3 లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సాయంగా అందజేశారు. మృతుని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భువనేశ్వరి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. భువనేశ్వరి ఎదుట భావోద్వేగానికి గురై మృతుని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

మహిళలంటే అమితమైన అభిమానం, ప్రేమ చంద్రబాబుకు ఉందని భువనేశ్వరి అన్నారు. మీ అందరి ఆధారభిమానాలతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు సంఘీభావం తెలిపిన మహిళలందరికీ చేతులు జోడించి నమస్కరించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేడు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మీ అందరి ఆదరాభిమానాలతో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. మహిళలతో తన అభిమానాన్ని పంచుకొని ఫొటోలు దిగారు.

కర్నూలు జిల్లాలో నిజం గెలవాలి యాత్ర - పలు కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శ

అక్టోబర్‌లో ప్రారంభమైన యాత్ర : చంద్రబాబు అక్రమ అరెస్ట్​తో ఆవేదనకు గురై మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో గతేడాది అక్టోబర్‌ నెలలో చంద్రగిరి నియోజకవర్గంలో ఈ యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు విడుదలయిన తరువాత భువనేశ్వరి యాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. తాజాగా మళ్లీ 'నిజం గెలవాలి' పేరుతో మృతి చెందిన వారి కుటుంబాలను ఓదారుస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తూ, వారికి తాము ఉన్నామనే ధైర్యం ఇస్తున్నారు.

Last Updated : Feb 1, 2024, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.