ETV Bharat / state

ఎన్నికల కురుక్షేత్రంలో ఓటే ప్రజల ఆయుధం - నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: ఎన్నికల కురుక్షేత్రంలో ఓటు ప్రజల ఆయుధమని నిజం గెలవాలి యాత్రలో భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో గుండెపోటుతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరమర్శించారు. చేనేత పట్టుచీరల మార్కెటింగ్​కు తనవంతు సహాయం అందిస్తానని ఆమె మహిళలకు హామీ ఇచ్చారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 9:26 AM IST

ఎన్నికల కురుక్షేత్రంలో ఓటే ప్రజల ఆయుధం- నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి యాత్ర'

Nara Bhuvaneswari Nijam Gelavali Yatra: రాబోతున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఓటే ప్రజల ఆయుధమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతై పోతున్నాయని ప్రతి ఒక్కరు తమ ఓటును పరిశీలించుకోవాలని సూచించారు. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించారు.

మహిళలంతా స్వయం శక్తితో ఎదగాలి: నారా భువనేశ్వరి
Bhuvaneshwari Provided Financial Help Dead Families: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం అందరూ ఓటుతో సిద్ధం కావాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ప్రజలు చూపిన అభిమానాన్ని ఊపిరి ఉన్నంత వరకు మర్చిపోనని పేర్కొన్నారు. కదిరి ఎర్రదొడ్డి విడిది కేంద్రం వద్ద హాస్టల్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన భువనేశ్వరి తలిదండ్రుల ఆశలు నెరవేర్చాలని స్ఫూర్తినిచ్చారు. ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం సంజీవపురంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటరాముడి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర - నాలుగు రోజుల పాటు పర్యటన

Bhuvaneshwari Meet With Handloom Women at Dharmavaram: ధర్మవరంలో చేనేత మహిళలతో భువనేశ్వరి నిర్వహించిన ముఖాముఖికి పెద్దఎత్తున స్పందన వచ్చింది. పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి చేనేత మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. పవర్ లూమ్స్‌తో చేనేత కుటుంబాలు ఏ విధంగా నష్టపోతున్నారో తనకు బాగా తెలుసని భవనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పట్టుచీరలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మీరే ఉండాలని పలువురు చేనేత మహిళలు భువనేశ్వరిని కోరారు. మహిళల చేతుల మీదుగా తయరయ్యే చేనేత పట్టుచీరల మార్కెటింగ్​కు తన వంతుగా సహాయం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పేద చేనేత మహిళలకు భువనేశ్వరి గుండె నిండా ధైర్యం నింపారు.

ప్రకాశం జిల్లాలో నారా భువనేశ్వరి యాత్ర - పలు కుటుంబాలకు ₹3లక్షలు ఆర్థిక సాయం

Bhuvaneshwari visit TDP Leaders families: చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో గుండెపోటుతో మృతి చెందిన నలుగురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును ఆమె అందించారు. చేనేతలకు న్యాయం జరగాలంటే అది తెలుగుదేశంతోనే సాధ్యమని టీడీపీ నేతలు పంచుమర్తి అనురాధ, పరిటాల శ్రీరామ్‌ అన్నారు. నారా భువనేశ్వరి గురువారం హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లో గుండెపోటుతో మృతి చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. సాయంత్రం తిరిగి పుట్టపర్తి విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు.

బాపట్లలో భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర - పలు కుటుంబాలకు పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.