Nara Bhuvaneswari Nijam Gelavali Yatra : నారా చంద్రబాబు అరెస్ట్ సమయంలో మనస్థాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా మరణించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబీకులకు ఆర్థికంగా సాయం చేయడంతో పాటు, ఆ కుటుంబాల్లో ధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు.
ఎన్నికల కురుక్షేత్రంలో ఓటే ప్రజల ఆయుధం - నారా భువనేశ్వరి
Hindupuram: చంద్రబాబు అరెస్టు వార్త విని శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో మృతి చెందిన అంజనప్ప కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించి అంజనప్ప చిత్రపటానికి నివాళులు అర్పించారు. మూడు లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అంజనప్ప కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అంజనప్ప ఇంటి వద్దకు నారా భువనేశ్వరిని చూడటానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడికి వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నారా భువనేశ్వరికి స్వాగతం పలికారు.
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి - విద్యార్థులతో భువనేశ్వరి
చిన్నారికి నామకరణం: నారా భవనేశ్వరి చేతుల మీదుగా తమ కుమారుడికి నామకరణం చేయించాలని అదే జిల్లాలోని శింగనమల నుంచి వచ్చిన దంపతులు తమ చిన్నారితో హిందూపురం వెళ్లారు. శింగనమలకు చెందిన హేమంత్ యాదవ్, శోభాయాదవ్ దంపతులు తమ చిన్నారితో భువనేశ్వరి ఉన్న శ్రీకంఠాపురం గ్రామానికి వెళ్లారు. తమ చిన్నారికి మీరే పేరు పెట్టాలని భువనేశ్వరిని హేమంత్ యాదవ్ దంపతులు కోరారు. ఆమె చిన్నారిని ఎత్తుకొని ముద్దాడి, కుశల్ కృష్ణగా పేరు పెట్టారు. తమ కుమారుడిని మీరు పెట్టిన పేరుతో తొలుత మీరే పిలవాలని హేమంత్ దంపతులు కోరటంతో, నామకరణం అనంతరం కుశల్ కృష్ణా అంటూ పిలుస్తూ భువనేశ్వరి చిన్నారిని ముద్దాడారు. భవనేశ్వరి చేతుల మీదుగా పేరు పెట్టించిన దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రజల గురించే : నారా భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు: అక్రమ కేసులు పెట్టి బెదిరించే వారికి భయపడాల్సిన అవసరం లేదంటూ నారా భువనేశ్వరి కార్యకర్తల్లో ధైర్యం నింపారు. జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో నిజం గెలవాలి కార్యక్రమానికి వెళ్లిన భూవనేశ్వరికి మడకశిర ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరని, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ క్రమశిక్షణ కోరుకుంటారన్నారు. ఐదేళ్లుగా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారని, తెలుగుదేశం కార్యకర్తలను కొట్టడం, అక్రమ కేసులు పెట్టడం చేస్తూ భయపట్టే యత్నం చేశారన్నారు. అయితే టీడీపీ కార్యకర్తలు ఎవరూ భయపడరని, ఎవరో కింద పడేయాలని ప్రయత్నించినా సాధ్యం కాదని ఆమె కార్యకర్తల్లో ధైర్యం నింపారు.