ETV Bharat / state

చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రజల గురించే : నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ రాష్ట్ర ప్రజల గురించేనని ఆయన సతీమణి భువనేశ్వరి అన్నారు. ఆయన జైల్లో ఉన్న సమయంలో కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులను పరామర్శించాలని సూచించినట్లు గుర్తు చేశారు.

nara_bhuvaneshwari_nijam_gelavali_yatra
nara_bhuvaneshwari_nijam_gelavali_yatra
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 3:45 PM IST

Updated : Feb 9, 2024, 5:46 PM IST

Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: నిజం గెలవాలి యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్‌ జిల్లాలో కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. మృతుల కుటంబాలను ఓదార్చి వారికి తెలుగుదేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరం ఒకే కుటుంబ ధైర్యంగా ఉండండి అని బాధితులకు ఆమె ధైర్యాన్నిస్తున్నారు. అంతేకాకుండా నందిగామ మండలం కంచికర్లలో చంద్రశేఖరరావు కుటుంబాన్ని పరామర్శించారు.

ఎన్టీఆర్​ జిల్లాలోని నందిగామ మండలం కంచికర్లలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు చంద్రశేఖర్‌రావు ఆనారోగ్యంతో మరణించారు. నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. దేవినేని ఉమాను కలిసి, చంద్రశేఖరరావు చిత్రపటానికి ఆమె అంజలి ఘటించారు.

చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రజల గురించే : నారా భువనేశ్వరి

మహిళలంతా స్వయం శక్తితో ఎదగాలి: నారా భువనేశ్వరి

తెలుగుదేశం అన్ని వేళలా అండగా ఉంటుంది: చందర్లపాడు మండలం కోనయపాలెం గ్రామంలో భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మరణించిన వనపర్తి మల్లికార్జున కుటుంబసభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. మల్లికార్జున నివాళులు అర్పించారు. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని మల్లికార్జున కుటుంబానికి అందించారు. తెలుగుదేశం అన్నివేళలా అండగా ఉంటుందని వారి కుటుంబానికి ధైర్యమిచ్చారు.

Nara Bhuvaneshwari Tour చంద్రబాబు అక్రమ అరెస్టుతో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు 60 కుటుంబాలను పరామర్శించినట్లు భువనేశ్వరి వివరించారు. ఇంకా పరామర్శించాల్సిన కుటుంబాలు సుమారు 160 వరకు ఉన్నాయని, వారందర్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడు ప్రజల బాగు గురించేనని భువనేశ్వరి స్పష్టం చేశారు.

ఎవ్వరూ అధైర్యపడొద్దు - టీడీపీ అండగా ఉంటుంది: భువనేశ్వరి

తెలుగుదేశం తప్పక విజయం సాధిస్తుంది: చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో, టీడీపీ కుటుంబసభ్యులను కలిసి పరామర్శించాలని సూచించినట్లు భువనేశ్వరి వెల్లడించారు. అందులో భాగంగానే నిజం గెలవాలి పాదయాత్రను ప్రారంభించినట్లు ఉద్ఘాటించారు. రానున్న రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగనుందని, దానిలో తెలుగుదేశం తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

నిజం గెలవాలిపై ప్రత్యేక వీడియో సాంగ్​ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు దంపతులు ప్రత్యేకంగా రుపోందించగా, నిజం గెలవాలి పర్యటన సందర్భంగా నారా భువనేశ్వరి వీడియో గీతాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక గీతంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గద్దె అనురాధను భువనేశ్వరి ప్రశంసించారు.

టీడీపీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తాం: నారా భువనేశ్వరి

జగ్గయ్యపేట నియోజవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అలవాల గోపయ్య కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. గోపయ్య భార్య పుల్లమ్మకు మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు. నారా భువనేశ్వరి పర్యటనను పురస్కరించుకొని జగ్గయ్యపేట నియోజకవర్గంలోని తెలుగు మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ యాత్రలో పాల్గొన్న మహిళలు, 'నిజం గెలవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆమె వెంట విజయవాడ పార్లమెంటు, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ముఖ్యనేతలు కార్యకర్తలు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలు అమలు: భువనేశ్వరి

Last Updated : Feb 9, 2024, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.