Murder Attempt on Elderly Woman With Towel: అనకాపల్లిలో ఓ ఇంట్లో వృద్ధురాలిపై అతి కిరాతకంగా హత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. హత్యాయత్నం చేసి మెడలోని ఎనిమిది తులాల బంగారు వస్తువులను దుండగుడు అపహరించాడు. ఈ నెల 26వ తేదీన ఒంటరిగా ఉన్న వృద్ధురాలి వద్దకు వెళ్లి ఓ వ్యక్తి తువ్వాలుతో ఆమె మెడకు చుట్టి గొంతు నులిమి హత్యాయత్నం చేశారు.
గవరపాలెం పార్కు సెంటర్ వద్ద నివసిస్తున్న కర్రి లక్ష్మీ నారాయణమ్మ టీవీ ప్రసారాల కోసం కేబుల్ ఆపరేటర్ గోవింద్‌కు ఫోన్ చేశారు. ఈనెల 26వ తేదీన రాత్రి 7.30 గంటల సమయంలో అతను ఇంట్లోకి వచ్చాడు. వృద్ధురాలు ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఆమె మెడకు తువ్వాలును బిగించాడు.
ప్రేమికుల్లా ఇన్‌స్టాలో రీల్స్?- అలా చేయనందుకే స్కూల్ టీచర్ దీపికను చంపేశాడట!
దీంతో వృద్ధురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మృతి చెందిందని భావించి ఆమె ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు నగలు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. కొంత సమయం కొంత సమయం తరవాత ఆమె కుమార్తె, అల్లుడు ఇంటికి వచ్చారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను చూసి హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. దీనిపై బాధిత వృద్ధురాలి కుటుంబ సభ్యులు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తన తల్లిపై హత్యాయత్నం జరిగిందన్న విషయం ఆలస్యంగా కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉంటున్న నారాయణమ్మ కుమారుడు కిశోర్‌కుమార్‌కి చెప్పడంతో ఆయన అనకాపల్లి వచ్చాడు. తన తల్లికి ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె స్పృహ కోల్పోయి ఉంటుందని ఆమె కుమారుడు తొలుత భావించారు.
ఆస్తి కోసం స్నేహితుడి ఘాతుకం - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య
కానీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించగా, అందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారు నివాసం ఉండే చోట కేబుల్ నెట్‌వర్క్‌లో పని చేసే గోవింద్ అనే వ్యక్తి టీవిని పరిశీలించేందుకు ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చాడు. వృద్ధురాలిపై హత్యాత్నానికి పాల్పడ్డినట్లు రికార్డు అయింది.
ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయినట్లు క్లియర్ సీసీటీవీలో తెలుస్తోంది. దీంతో వెంటనే పోలీసులకు సీసీ టీవీ వీడియోని చూపించడంతో వారు నిందితుడి కోసం గాలించారు. నిందితుడు సోమవారం ఉదయం పోలీసులకు లొంగిపోయినట్లు బాధితురాలి కుమారుడు కిషోర్ తెలిపారు. తన తల్లికి వచ్చిన పరిస్థితి మరెవరికీ జరగకూడదంటూ కిషోర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.