ETV Bharat / state

ఏలూరు జిల్లాలో దారుణం - ఆస్తి తగాదాలతో తల్లి, కుమారుడి దారుణ హత్య - DOUBLE MURDER IN ELURU DISTRICT

మండవల్లి మండలం గన్నవరంలో ఘటన

Double Murder in Eluru district
Double Murder in Eluru district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2024, 2:21 PM IST

Double Murder in Eluru District : నేటి సమాజంలో సాంకేతికతో పాటు మనుషులూ మారిపోతున్నారు. ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసేవారు. కానీ నేడు ఆస్తిపాస్తులు, డబ్బుకు విలువ ఇస్తున్నారు. ఇందుకోసం ఎంతటి దారుణానికైనా వెనకాడటం లేదు. ఎంతలా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రక్త సంబంధీకులనైనా కడతేర్చడానికైనా సిద్ధపడుతున్నారు. తాజాగా ఆస్తి తగాదాల నేపథ్యంలో ఇద్దరిని దారుణంగా హతమార్చారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటన ఏల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో ఆస్తి తగాదాలతో తల్లి, కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. మృతులు రొయ్యూరు భ్రమరాంబ, ఆమె కుమారుడు సురేష్​గా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ భార్య తండ్రి సంవత్సరికం కావడంతో భార్యా పిల్లలను శుక్రవారం ముసునూరులో వదిలి, తల్లి ఒక్కటే ఉంటుందన్న కారణంతో తిరిగి గ్రామానికి వచ్చాడు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది.

మృతుడు ఐటీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తల్లి, కుమారుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఏలూరు డీఎస్పీ శ్రవణ్​కుమార్ పరిశీలించారు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు డీఎస్పీ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. మరోవైపు మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కొట్టి చంపి బావిలో పడేశారు - సహ విద్యార్థుల ఘాతుకం

ఈత నేర్పిస్తామని చెప్పి నీట ముంచారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.