Mosambi Farmers Facing Problem With Low Price : చీడపీడలు, నీటి ఎద్దడిని ఎదుర్కొని కష్టపడి పండించిన బత్తాయి పంట దళారుల పాలవుతోంది. మార్కెట్‌లో మంచి ధర ఉన్నా వ్యాపారులు నియంత్రిస్తున్నారు. కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పండించిన పంట మొత్తం నెల్లూరు మార్కెట్‌కే వస్తుంది. ఏదో సాకులు చెప్పి రెండోరకం పేరిట మద్దతు ధరలో వ్యాపారులు కోత విధిస్తున్నారు. దళారులు మొత్తం సిండికేట్‌గా ఏర్పడి రైతును దోచుకుంటున్నా మార్కెటింగ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
Traders Cheating Farmers : నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో సాగునీటి సౌకర్యం అంతగా లేని మెట్ట ప్రాంతాల్లో పెద్దఎత్తున బత్తాయి సాగు చేస్తారు. వరికుంటపాడు, ఉదయగిరి, పామూరు, సీఎస్.పురం, వెలిగండ్ల, అలవలపాడు మండలాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో బత్తాయి సాగవుతోంది. తక్కువ పెట్టుబడితో ఆరునెలల పాటు కాపు ఉండటంతో రైతులు బత్తాయి సాగు చేస్తారు.
పండుఈగతో మామిడి రైతుకు నష్టం - ఎరువులపై సబ్సిడీ ఇవ్వని ప్రభుత్వం - Loss Money To Mango Farmers
సాగునీరు లేకపోయినా బోర్లు ద్వారా పంటను కాపాడుకుని మంచి దిగుబడి సాధించారు. అయితే వ్యాపారులు చేసే మోసంతో బత్తాయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేసవి సీజన్‌లో బత్తాయికి మంచి ధర ఉన్నా వ్యాపారులు సిండికేట్‌గా మారి అమాంతం ధర తగ్గించేస్తున్నారు. ఈ మూడు జిల్లాల నుంచి బత్తాయిలు నెల్లూరుకు మార్కెట్‌కు వస్తాయి. ఇక్కడ 60 మంది వరకు బత్తాయి హోల్‌సేల్ వ్యాపారులు ఉన్నారు. వీరంతా ఒక్కటిగా మారి డిమాండ్ ఉన్నా ధరలు తగ్గించేస్తున్నారు. మార్కెటింగ్‌శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు వ్యాపారులు చెప్పిన ధరకే విక్రయించాల్సి వస్తోంది.
ముందస్తు వర్షాలతో అన్నదాత ఆనందం - సాగులో సింహభాగం వేరుశనగదే - GROUDNUT FARMERS HAPPY
నీటి ఎద్దడి, చీడపీడల కారణంగా పెట్టుబడులు రెట్టింపైనా వేసవిలో మంచి ధర వస్తుందన్న ఆశతో అప్పులు చేసి మరీ రైతులు పంటను కాపాడుకున్నారు. టన్ను బత్తాయి 30 వేల నుంచి 40 వేల రూపాయలు మధ్య ధరలు పలికితేనే రైతుకు లాభాలు వస్తాయి. అయితే వ్యాపారులు సిండికేట్‌గా మారి 20 వేల నుంచి 25 వేలకే కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత లేదంటూ కొందరి వద్ద 15 వేలకే కొనుగోలు చేస్తున్నారు. తోటల వద్దకు నేరుగా వెళ్లి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు15 రోజుల్లో డబ్బులు ఇస్తామని చెప్పి పరారవుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. మార్కెటింగ్‌శాఖ అధికారులు దృష్టి సారించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.
తారుమారైన కోనసీమ కొబ్బరి పరిస్థితులు - ధరల పతనంతో రైతన్న కుదేలు - Coconut Prices Fall In Ap