Moon Cactus Flower in East Godavari District : రేక రేకనూ ఏరి కోరి గుదిగుచ్చినట్లు.. ప్రకృతిలోని సౌందర్యమంతా పోగు పడి వికసించినట్లూ... ఇంత అందం, ఇంత సుకుమారం మరెక్కడా లేనట్లూ కనువిందు చేస్తున్న ఈ పువ్వులు అందరి చూపునూ కట్టిపడేస్తాయి. ఆ పూలను చూస్తే చటుక్కున తీసుకుని తల్లో తురుముకోవాలనిపిస్తుంది. ముట్టుకుంటే నలిగిపోతాయేమో అనిపించినా ఆ పువ్వులను పట్టుకుని ముద్దాడాలనిపిస్తుంది.
ఒకే రోజులో మూడు రంగులు- ఊసరవెల్లి మాత్రం కాదు
గుత్తులు గుత్తులుగా పసుపు, ఎరుపు రంగుల్లో కనిపిస్తాయి ఈ పూలు. ఎంతో అందంగా ఆకట్టుకునేలా ఉంటాయి. వీటిని చూడగానే ముద్దబంతి పూలు అనుకుంటే పొరబడినట్లే. థాయ్‌లాండ్ దేశానికి చెందిన వీటిని మూన్ కాక్టేసీగా పిలుస్తారు. ఇవి జముడు జాతికి చెందినవి. ఇళ్లు, కార్యాలయాల్లో అలంకరణ కోసం వీటిని ఉపయోగిస్తారు. వీటిని పెంచుకోడాన్ని చాలా మంది శుభ సూచికంగా భావిస్తారు అందుకే వీటికి మంచి గిరాకీ ఉంటుంది. దీని జీవితకాలం ఏడాదిన్నర. రంగును బట్టి రూ.250 నుంచి రూ.600 వరకు ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా కడియం పల్లా వెంకన్న నర్సరీలో ఈ పూలు కనువిందు చేశాయి.
అద్భుతం - ఒకే చెట్టుకు విరబూసిన 20 బ్రహ్మ కమలాలు - 20 Brahma Kamalam Flowers at a Time