ETV Bharat / state

మోహన్‌బాబు, విష్ణులకు హైకోర్టులో ఊరట - పోలీసుల నోటీసులపై స్టే - MOHANBABU TO HIGH COURT

పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వాలని హైకోర్టుకు వెళ్లిన మోహన్​బాబు, విష్ణు - ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు

Mohanbabu
Mohanbabu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2024, 3:30 PM IST

Updated : Dec 11, 2024, 10:42 PM IST

Mohanbabu Lunchmotion Petition in Telangana High Court: రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై మోహన్‌బాబు, విష్ణులకు హైకోర్టులో ఊరట లభించింది. మోహన్‌బాబు లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి ఈ నెల 24 వరకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పహడీషరీఫ్ పీఎస్‌లో కేసు నమోదు కాగా దర్యాప్తులో భాగంగా మోహన్‌బాబు, విష్ణులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

నోటీసులను సవాల్‌ చేస్తూ మోహన్‌బాబు, విష్ణు హైకోర్టును ఆశ్రయించారు. మనోజ్ బౌన్సర్లను తీసుకొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నారని కుటుంబ విషయాలను మీడియాలో పెద్దదిగా చేసి చూపిస్తున్నారని మోహన్‌బాబు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మోహన్‌బాబు అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న హైకోర్టు ఈనెల 24 వరకు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ కేసును వాయిదా వేసింది.

హెల్త్​ బులెటిన్​: నటుడు మంచు మోహన్‌బాబుకు బీపీ ఎక్కువగా ఉండి అధిక నొప్పులతో హాస్పిటల్‌లో చేరారని కాంటినెంటల్​ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి వెల్లడించారు. అయనకు కొన్ని గాయాలతోపాటు కంటి కింద వాపుగా ఉందని తెలిపారు. మంగళవారం సాయంత్రం మోహన్‌బాబు హాస్పిటల్‌కు వచ్చారని పేర్కొన్నారు. బుధవారం సిటీ స్కాన్ చేస్తామన్నారు. మోహన్‌బాబు ఆరోగ్యంపై ఆసుపత్రి చైర్మన్ హెల్త్‌ బులిటెన్ విడుదల చేసి వివరాలను ప్రకటించారు.

మోహన్ బాబుకు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రఘువీర్‌, కార్డియాలజిస్ట్‌ సీఎన్‌ మూర్తి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మోహన్‌బాబు ఆరోగ్యం నిలకడగా ఉండేందుకు రెండు రోజుల సమయం పడే అవకాశం ఉందన్నారు. అయన మానసికంగా చాలా బలహీనంగా ఉన్నారని వైద్యులు వివరించారు.

Manchu Vishnu AT Rachakonda Commissionerate : రాచకొండ కమిషనరేట్‌లో సీపీ సుధీర్​బాబు ఎదుట మంచు విష్ణు విచారణకు హాజరయ్యారు. మరోసారి శాంతిభద్రతలు విఘాతం కలిగేలా వ్యవహరించవద్దని ఈ సందర్భంగా మంచు విష్ణుకి సీపీ ఆదేశించారు. మరోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని సూచించారు. ఈ సందర్భంగా ఈ నెల 24 వరకు హైకోర్టు ఇచ్చిన మినహాయింపు గురించి సీపీకి విష్ణు తెలిపారు.

ఇంటిదగ్గర ఎలాంటి ఇబ్బంది ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని విష్ణుకు సీపీ సూచించారు. శాంతి భద్రతలుకు విఘాతం కలిగిస్తే లక్షరూపాయలు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని సీపీ సుధీర్​ బాబు తెలిపారు.

రాచకొండ కమిషనరేట్​లో సీపీ ఎదుట మంచు విష్ణు
రాచకొండ కమిషనరేట్​లో సీపీ ఎదుట మంచు విష్ణు (ETV Bharat)

ఉదయం మంచు మనోజ్ విచారణ : సీపీ ఎదుట ఉదయం మంచు మనోజ్​ విచారణ జరిగింది. ఈ సందర్భంగా మంచు మనోజ్​ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని సీపీ చెప్పారు. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మనోజ్​కు సీపీ సూచించారు. ఎలాంటి ప్రతికూల చర్యలకు దిగకుండా ఉంటానని మనోజ్​ బాండ్ ఇచ్చారు.

మంచు విష్ణు ప్రధాన అనుచరుడు అరెస్ట్ : మరోవైపు ఈ కేసులో హీరో మంచు మనోజ్‌పై దాడి కేసులో విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. 3 రోజుల క్రితం తనపై దాడి చేశారని నటుడు మనోజ్‌ పహడీషరీఫ్ పోలీసులకు కంప్లైంట్​ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం ఈ అరెస్ట్‌ చేశారు. జల్‌పల్లిలో తనపై దాడి చేయడమే కాకుండా సీసీటీవీ ఫుటేజ్‌ను మాయం చేశారన్న మనోజ్‌ కంప్లైంట్​ మేరకు మోహన్‌బాబు మేనేజర్‌ కిరణ్‌, విజయ్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. ఇదే కేసులో నలుగురు మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం.

"నేను ఇంటికి వెళ్లడానికి అదొక్కటే కారణం - నా భార్య తల్లిదండ్రులు ఉండుంటే ఊరుకునేవారా?"

మీడియా ప్రతినిధులపై దాడి - మోహన్‌బాబుపై కేసు నమోదు

Last Updated : Dec 11, 2024, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.